2016 మోస్ట్‌ సర్‌ప్రైజింగ్‌ యాక్టర్‌

మరిన్ని వార్తలు

మోహన్‌లాల్‌ వరుసగా రెండు తెలుగు సినిమాల్లో నటించాడు. ఒకటి 'మనమంతా', ఇంకోటి 'జనతా గ్యారేజ్‌'. 


మనమంతా: ఈ సినిమా కమర్షియల్‌గా పెద్దగా వర్కవుట్‌ కాకపోయినా, విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మలయాళ్‌ హీరో తెలుగులో ఈ సినిమాతో ఇంతగా పాపులర్‌ అవ్వడం అనేది చిన్న విషయమేమీ కాదు. చంద్రశేఖర్‌ యేలేటి ఈ సినిమాకి దర్శకుడు. మధ్య తరగతి ఫ్యామిలీస్‌లోని ఎమోషన్స్‌ని ఈ సినిమా ద్వారా చాలా చాకచక్యంగా తెరకెక్కించాడు. నాలుగు స్టోరీలను ఒక తెరపై ఈక్వెల్‌ వెయిట్‌తో తెరకెక్కించాడు డైరెక్టర్‌. వాటన్నింటినీ లింక్‌ అప్‌ చేస్తూ కథకి సెంటర్‌ ఆఫ్‌ ది పోయింట్‌గా మోహన్‌లాల్‌ పాత్ర అద్భుతంగా ఉంది. అందుకే ఈ సినిమా అంత సక్సెస్‌ అయ్యింది. తన అప్పీయరెన్స్‌తో ఆ సినిమాకి స్టార్‌ వాల్యూ తెచ్చాడు మోహన్‌లాల్‌. అందుకే ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సీనియర్‌ నటి గౌతమి ఈ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చింది. 


జనతా గ్యారేజ్‌: మోహన్‌లాల్‌ తెలుగులో నటించిన మరో సినిమా ఇది. ఈ సినిమాలో ఎన్టీఆర్‌ హీరో కాగా, హీరోకి తండ్రి పాత్రలో నటించాడు మోహన్‌లాల్‌. ఈ ఏడాది బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది ఈ సినిమా. ఓవర్‌సీస్‌లో కూడా మంచి విజయం సాధించింది. అక్కడ విజయం సాధించడానికి మోహన్‌లాల్‌ కూడా ఓ కారణమని టాక్‌ ఉంది. అంతేకాదు ఇంతవరకూ ఎన్టీఆర్‌కి మలయాళంలో బిగినింగ్‌ లేదు. ఈ సినిమాతో అక్కడ కూడా ఎన్టీఆర్‌కి మంచి బిగినింగ్‌ లభించింది. మోహన్‌లాల్‌ వల్లే ఇది సాద్యమయ్యింది. అంతేకాదు ఈ సినిమాలో ఎన్టీఆర్‌ తండ్రిగా మోహన్‌లాల్‌ని కాక మరొకర్ని ఊహించడం కష్టం. టాలీవుడ్‌లోనే జగపతిబాబు, రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌ రాజ్‌ వంటి సీనియర్‌ నటులుండగా మోహన్‌లాల్‌ని ఎందుకు తీసుకురావడం అంటూ కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి. అంతేకాదు ఈ సినిమా కోసం మోహన్‌లాల్‌ చాలా రెమ్యునరేషన్‌ తీసుకున్నారంటూ వార్తలు కూడా వచ్చాయి. కానీ అవేమీ పట్టించుకోకుండా డైరెక్టర్‌ కొరటాల శివ మోహన్‌లాల్‌ని ఈ పాత్రకి ఎంచుకోవడం వెనుక ఆంతర్యం ఎంత ఉందో సినిమా రిజల్ట్‌ని చూసిన తర్వాత గానీ అర్ధం కాలేదు మన టాలీవుడ్‌ జనానికి. 


మరో పక్క మన తెలుగు నటుడు జగపతిబాబు కూడా తమిళ, కన్నడ భాషల్లో విలన్‌గా నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. 'మన్యం పులి' సినిమాలో జగపతిబాబు, మోహన్‌లాల్‌కి విలన్‌గా నటించాడు. ఇలా తెలుగుతో పాటు ఇతర భాషల్లో కూడా సీనియర్‌ నటులు మంచి మంచి ఆఫర్లు దక్కించుకుంటున్నారు. ఏదేమైనా దర్శకుడి ఆలోచనల్ని బట్టి కొన్ని పాత్రలు పుడుతుంటాయి. ఆ పాత్రకి ఆ నటుడు ఎంత న్యాయం చేశాడు? అన్నదే ముఖ్యం. అలా 'జనతా గ్యారేజ్‌'కి మోహన్‌లాల్‌ పూర్తి న్యాయం చేశాడు. మోహన్‌లాల్‌ అంటే మలయాళ సూపర్‌ స్టార్‌. ఆ స్టార్‌డమ్‌ తెలుగు సినిమాకి యాడెడ్‌ వాల్యూ అయ్యింది కదా. తద్వారా మోహన్‌లాల్‌ 2016లో మోస్ట్‌ సర్‌ప్రైజింగ్‌ యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ మలయాళ హీరోకి ఈ యేడాది తెలుగు సినీ పరిశ్రమ గ్రాండ్‌ వెల్‌కమ్‌ చెప్పింది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS