రూపాయికి రెండు... ప‌వ‌న్ పై పందాల ట్రెండు

మరిన్ని వార్తలు

ప‌వ‌న్ కళ్యాణ్ స్థాపించిన జ‌నసేన అధికారంలోకి వ‌స్తుందా? రాదా? అనేది అంద‌రూ ప‌క్క‌న పెట్టేశారు. ఇంత‌కీ ప‌వ‌న్ కళ్యాణ్ గెలుస్తాడా? లేదా? అనే పాయింట్‌పైనే ఆస‌క్తిగా చ‌ర్చించుకుంటున్నారు. భీమ‌వ‌రం, గాజువాక‌ల నుంచి ప‌వ‌న్ కళ్యాణ్ ఎం.ఎల్‌.ఏగా పోటీ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రెండు నియోజ‌క వ‌ర్గాల‌పై ఏపీ దృష్టి ప‌డింది. ఇక్క‌డ ప‌వ‌న్ గెలుస్తాడా? లేదా? గెలిస్తే మార్జిన్ ఎంత‌? అనే విష‌యంపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి.

 

ప‌వ‌న్ రెండు నియోజ‌క వ‌ర్గాల‌లోనూ గెలుస్తాడ‌ని బెట్ వేస్తే.. రూపాయికి రెండు రూపాయ‌లు ఇస్తున్నారు. రెండు చోట్లా ఓడిపోతాడ‌ని బెట్ వేసినా అంతే. భీమ‌వ‌రంలో గెలుస్తాడ‌ని కొంద‌రు, గాజువాక‌లో గెలుస్తాడ‌ని మ‌రికొంద‌రు బెట్టింగులు వేస్తున్నారు. ఏపీలో ఎప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఇలా బెట్టింగులు వేయ‌డం మామూలే. కానీ.. ఈసారి బెట్టింగు రాయుళ్ల దృష్టింతా ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై ప‌డిపోయింది.

 

ప‌వ‌న్‌పై పందాలు కాచేవారి కోసం ఓ ముఠా ప్ర‌త్యేకంగా గాలిస్తోంది. ఊర్ల‌లోకి సూట్ కేసుల‌తో స‌హా దిగిపోతోంది. భీమ‌వ‌రం, గాజువాక చుట్టు ప‌క్క‌ల ప్రాంతాల‌లో బెట్టింగు రాయుళ్లు మ‌కాం వేసిన‌ట్టు స‌మాచారం. ప‌వ‌న్ అభిమానులంతా ప‌వ‌న్ గెలుస్తాడ‌ని ఎక్క‌డ‌క్క‌డ పందాలు కాసేశారు. కోట్ల‌లో ఈ బెట్టింగ్ న‌డుస్తున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS