లేడీ సూపర్ స్టార్ అనుష్క తాజా చిత్రం భాగమతి ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంటుంది. తొలిరోజు నుండే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద స్థిరంగా కొనసాగుతున్నది.
విడుదలై మూడు రోజులు పూర్తయిన సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ 30కోట్ల గ్రాస్ కొల్లగొట్టగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ 12 కోట్ల (షేర్), రూ 18 కోట్ల (గ్రాస్) కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ వర్గాల రిపోర్ట్స్ చెబుతున్నాయి.
అయితే వారు పెట్టిన బడ్జెట్ తో పోలిస్తే ఈ వసూళ్ళు అంత ఆశాజనకంగా లేనప్పటికీ ఈ సినిమా తమిళం లో కూడా విడుదల చేశారు కాబట్టి అక్కడి కలెక్షన్స్ బట్టి ఈ చిత్రం భవిష్యత్తు చెప్పొచ్చు అని అన్నది ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తానికి అనుష్క సోలోగా వచ్చి అంతా తానై ఈ చిత్రం నడిపించింది అలాగే ఇప్పుడు ఈ అమ్మడు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా తన స్టార్ డమ్ తోనే వసూళ్ళు రాబడుతున్నది.