‘బాఘి3’ ఈసారి ఏ తెలుగు సినిమాని లేపేశాడో!

By Inkmantra - February 06, 2020 - 15:30 PM IST

మరిన్ని వార్తలు

బాలీవుడ్‌ కండల వీరుడు టైగర్‌ ష్రాఫ్‌ సినిమాలనగానే హాలీవుడ్‌ స్థాయి స్టంట్స్‌ని ఎక్స్‌పెక్ట్‌ చేస్తాం. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చేసింది ‘బాఘి-3’ ట్రైలర్‌. అదిరిపోయింది అనేది చాలా చిన్న మాట. ఇలాంటి సినిమాల్ని హాలీవుడ్‌లో మాత్రమే నిన్న మొన్నటిదాకా చూశాం, ఇప్పుడు ఇండియన్‌ సినిమాల్లోనూ చూస్తున్నాం. ‘బాఘి’ సిరీస్‌లో మొదటి సినిమా ‘వర్షం’కి రీమేక్‌. రెండో సినిమా ‘క్షణం’కి రీమేక్‌. ఆ సినిమాల్లోని చిన్న లైన్‌ తీసుకుని, మిగతా మొత్తాన్నీ యాక్షన్‌తో నింపేస్తారు. ‘బాఘీ-3’ కోసం ఏం చేశారోగానీ, ఇందులో అయితే అన్నదమ్ముల సెంటిమెంట్‌ కనిపిస్తోంది. అన్నయ్య కోసం ఏకంగా హీరో, సిరియా వెళ్ళిపోతాడు. సిరియా అంటే అక్కడ కరడుగట్టిన తీవ్రవాద సంస్థ ఐసిస్‌ రాజ్యమేలుతోంది. ఆ ఐసిస్‌ మూకలతో మన హీరో ఫైట్‌ చేసేస్తాడు.

ఈ సినిమాలో శ్రద్ధా కపూర్‌ హీరోయిన్‌. తెలుగులో చాలా సినిమాలు చేసిన ఒకప్పటి హీరోయిన్‌ జెనీలియా భర్త రితీష్‌ దేశ్‌ముఖ్‌, టైగర్‌ ష్రాఫ్‌కి అన్నయ్యగా నటిస్తున్నాడు. యాక్షన్‌ మాత్రం వీర లెవల్లో కన్పిస్తోంది. సినిమా ఎలాగూ ది¸యేటర్లలో దుమ్ము దులిపేస్తుందని టైగర్‌ ష్రాఫ్‌ అభిమానులు చెబుతున్నారు. కండలు తిరిగే ఫిజిక్‌.. శరీరంలో అసలు ఎముకలు వున్నాయా.? లేదా.? అన్నట్లు రబ్బర్‌లా ఎలా కావాలంటే అలా వంపులు తిరిగే బాడీ పార్ట్స్‌.. ఇవన్నీ అభిమానుల్ని ఓ రేంజ్‌లో అలరించేస్తున్నాయి అప్పుడే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS