ఫ్యాక్షన్‌ 'గీత' వర్మ హిట్‌ కొట్టేనా.?

మరిన్ని వార్తలు

యదార్ధ గాధ ఆధారంగా తెరకెక్కుతోన్న చిత్రం 'భైరవగీత'. ఈ సినిమాకి రామ్‌గోపాల్‌ వర్మ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సిద్దార్ద్‌ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. కన్నడ నటుడు ధనుంజయ్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో ముద్దుగుమ్మ ఇరా హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమవుతోంది. 

సినిమా చిత్రీకరణ దశలోనే వర్మగారు హీరోయిన్‌ ఇరాని పొగడ్తలతో ముంచెత్తేసిన సంగతి తెలిసిందే. తాజాగా విడదలైన ట్రైలర్‌లో ఇరా పర్‌ఫామెన్స్‌ని అదే స్థాయిలో చూపించారు. ట్రైలర్‌ చివర్లో కత్తి పట్టి పవర్‌ఫుల్‌ లుక్స్‌లో కనిపించింది ఇరా. ఇకపోతే కన్నడ నటుడు ధనుంజయ్‌ యాక్షన్‌ సీన్స్‌ ఇరగదీసేశాడు. వర్మ సినిమాల్లో ఉండే ఫ్యాక్షన్‌ మార్క్‌ని ఈ సినిమాలో అచ్చంగా దించేసి చూపించారు. 

ఇకపోతే హీరో, హీరోయిన్‌ మద్య రొమాన్స్‌ హద్దులు దాటేలానే ఉంది. లిప్‌లాక్‌ సీన్స్‌, ఘాటు రొమాంటిక్‌ సీన్స్‌ యూత్‌ని ఎట్రాక్ట్‌ చేసే రేంజ్‌లోనే ఉన్నాయి. అన్నీ వెరసి పవర్‌ఫుల్‌ ఫ్యాక్షనిజం 'భైరవగీత' ట్రైలర్‌లో చూపించకనే చూపించేశారు. ఈ మధ్య వర్మ ఖాతాలో డైరెక్టర్‌గా కొట్టిన హిట్సేమీ లేవు. ఆయన నిర్మాణంలో వస్తున్న ఈ భైరవగీత' సినిమా ట్రైలర్‌ వచ్చాక అంచనాలు పెరిగాయి. ఈ మధ్య హిట్‌ కొడుతున్న సినిమాల్లో ఇలాంటి రా సబ్జెక్ట్స్‌కే ఎక్కువ పట్టం కడుతున్న సంగతి తెలిసిందే. అందుకే ఈ ఫ్యాక్షన్‌ లవ్‌ స్టోరీతో రామ్‌గోపాల్‌ వర్మ హిట్‌ కొడతాడని అభిమానులు భావిస్తున్నారు చూడాలి మరి. 

'రోబో 2.0' చాలా పెద్ద దర్శకుడు చిన్న పిల్లల కోసం తీసిన సినిమా.. 'భైరవగీత' చాలా చిన్న పిల్లోడు పెద్దవాళ్ల కోసం తీసిన సినిమా..' అంటూ వర్మ తన ట్విట్టర్‌ ద్వారా ఈ కొత్త ట్రైలర్‌ని విడుదల చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS