సరిగ్గా ఈ నాటికి మన తెలుగు చలన చిత్ర పరిశ్రమ 85యేండ్లు పూర్తి చేసుకుంది. దానికి కొలమానం అయిన తోలి తెలుగు టాకీ చిత్రం "భక్త ప్రహ్లాద" రిలీజ్ అయిన రోజు నేడు.
ఈ చిత్రాన్ని సుప్రసిద్ధ దర్శక నిర్మాత అయిన హెచ్ ఏం రెడ్డి గారి నిర్మాణ సారధ్యంలో 21 రోజుల్లో రూ 18000/- ఖర్చుతోనిర్మించబడింది. అయితే హెచ్ ఏం రెడ్డి గారు భారతదేశ తోలి టాకీ చిత్రం అయిన "ఆలం ఆరా"కి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడం విశేషం. ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీని ఈ 85 ఏళ్ళ ప్రయాణంలో చాలా ఒడిదొడుకులను ఎదురుకుంది, అలాగే భారతదేశ చలన చిత్ర చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది.
సరిగ్గా దశాబ్దం క్రిందటనే తెలుగు చలన చిత్ర పరిశ్రమ 75 పూర్తిచేసుకున్న సందర్బంలో యావత్ ఇండస్ట్రీ వజ్రోత్సవ వేడుకలను నిర్వహించింది. ఇంకొక 15 ఏళ్ళలో శతాబ్ది ఉత్సవాలు జరుపుకునే సమయానికి ఈ పరిసరం ఇంకా అద్బుతంగా తన ఉనికి చాటుకుంటుంది అని కోరుకుంటున్నాం.