భానుశ్రీ, శ్యామల.. బిగ్ బాస్ ఇంటి నుండి వెళ్ళే సమయంలో వారిరువురి పైన అందరికి జాలీ కలిగింది. దీనికి ప్రధాన కారణం వారు సొంతంగా చేసిన పనులకి వారు ఎలిమినేట్ అవ్వలేదు అని అన్నది వీక్షకుల భావన గా ఉంది.
ఈ తరుణంలోనే వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ ఇంటికి వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు అన్న వార్త ఇప్పుడు హల్చల్ చేస్తున్నది. పైగా వీరి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసే పనినిన ఇంటి సభ్యులకే బిగ్ బాస్ ఇవ్వనున్నారు అని ఆ వార్త సారాంశం.
అయితే ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలో ఇంటి నుండి వెళ్ళిపోయిన సభ్యుడు వైల్డ్ కార్డ్ రూపంలో మళ్ళీ రాలేదు! ఈ పాయింట్ కూడా ఆ వార్తని తోసిపుచ్చేలానే ఉంది.
మరి ఈ వార్త నిజమా కాదా అనేది ఈరోజు రేపటి బిగ్ బాస్ ఎపిసోడ్స్ లో మనకి తేలిపోనుంది. ఇంతకి మీరు ఈ వార్తని నమ్ముతున్నారా? లేదా?