బిగ్ బాస్ ఇంటిలో తొలుత కోపిష్టిగా పేరుతెచ్చుకున్న తనీష్ ఆ తరువాత నెమ్మదిగా అతనిలోని మంచితనాన్ని, పక్కవాళ్ళకి సహాయ పడే మనస్తత్వాన్ని బయటపెట్టగలిగాడు. ఈ తరుణంలో ఆయన ఈ వారానికి ఇంటి కెప్టెన్ గా వ్యవహరించేందుకు సిద్ధం అయ్యాడు.
నిన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ లో అమిత్, బాబు గోగినేని లని ఓడించి ఈ వారానికి ఇంటి కెప్టెన్ గా ఎంపికయ్యాడు. ఇక ఇదే సమయంలో ఆయన ఈ వారం ఎలిమినేషన్ లో ఉండడం ఆసక్తికరంగా మారింది. అయితే ఇప్పటివరకు ఉన్న అంచనాలు, ఊహాగానాలు బట్టి తనీష్ ఈవారం సేఫ్ గానే ఉంటాడు అని తెలుస్తుంది.
తనీష్ కెప్టెన్సీ లో ఇప్పుడు కౌశల్ ఎలా వ్యవహరిస్తాడు అనేది చూడాలి. ఎందుకంటే ఈ ఇంటిలో తనీష్ కెప్టెన్సీ పైన ఆసక్తిగా లేని వ్యక్తి అతను ఒక్కడే.
మరి ఈ కెప్టెన్సీ తనీష్ లోని మరేదైనా కొత్త కోణం ఈవారంలో మనకి చూపిస్తాడా లేదా అన్నది ముందు ముందు తెలుస్తుంది.