జూలై 3 న 'భానుమతి రామకృష్ణ' ప్రీమియర్.

మరిన్ని వార్తలు

ఇటీవల వచ్చిన 'భానుమతి రామకృష్ణ' ట్రైలర్ సంచలనం సృష్టించి ప్రేక్షకుల్లో ఆసక్తి రేపింది. కొత్తగా కనిపిస్తున్న ఈ రొమాన్స్ డ్రామా, జూలై 3 న ప్రపంచ ప్రీమియర్ ప్రదర్శనకు సిద్ధమైంది. భిన్న మనస్తత్వాలు కలిగి, ముప్పయేళ్ల వయసులో ఉన్న ఒక అమ్మాయి అబ్బాయి మధ్య ప్రేమ చిగురించినప్పుడు, ఆ సంఘర్షణను వారు ఎలా ఎదుర్కొన్నారు అనే కథాంశంతో వస్తున్న ఇందులో, భానుమతిగా సలోని లూథ్రా , రామకృష్ణగా నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించారు.

 

వైవిధ్యమైన కథనంతో సాగే శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం, సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు చూపించిన అద్భుతమైన విజువల్స్, శ్రవణ్ భరద్వాజ్ సమకూర్చిన సంగీతం ఈ చిత్రానికి హైలైట్ అవుతుంది. అచ్చు రాజమణి నేపథ్య సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ,ప్రముఖ యువ దర్శకుడు రవికాంత్ పెరెపు ఎడిట్ చేశారు. ప్రముఖ తెలుగు చిత్ర నిర్మాత అల్లు అరవింద్ 'భానుమతి రామకృష్ణ' పోస్టర్ను విడుదల చేసి మాట్లాడుతూ - "చాలా కాలం తరువాత ఒక అందమైన ప్రేమకథను చూస్తున్నట్లు అనిపించింది. 30 ఏళ్ళ వయసులో ఉన్న పరిణితి చెందిన అమ్మాయి అబ్బాయి ప్రేమ కథను చూడటం ఆసక్తికరంగా ఉంది. ఇలాంటి కథలు మనం తరచుగా చూడనిది. మొదటిసారిగా ఈ చిత్రం ఆహలో విడుదల అవుతుందని ఉత్సాహాన్ని వ్యక్తం చేశారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS