రంగస్థలం రికార్డ్ బ్రేక్ చేసిన భరత్ అనే నేను

By iQlikMovies - April 21, 2018 - 18:20 PM IST

మరిన్ని వార్తలు

నిన్న విడుదలైన సూపర్ స్టార్ మహేష్ చిత్రం భరత్ అనే నేను మొదటి షో నుండే హిట్ టాక్ సంపాదించుకుంది.

ఇక కలెక్షన్స్ కూడా మంచి హిట్ రేంజ్ చిత్రానికి వచ్చిన స్థాయిలోనే రానున్నాయి అన్నది ట్రేడ్ వర్గాల అంచనా. అయితే ఈమధ్య కాలంలో చెన్నై సిటీలో తెలుగు చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తున్నది. మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రూ 24 లక్షలు తొలిరోజు వసూలు చేయగా, నిన్నటికి నిన్న రామ్ చరణ్ రంగస్థలం రూ 25 లక్షల వసూళ్ళు సాధించింది.

ఈ రెండు రికార్డులని పక్కకి తోస్తూ మహేష్ బాబు భరత్ అనే నేను చిత్రం మొదటిరోజు చెన్నై సిటీలో రూ 26 లక్షలు కొల్లగొట్టింది. ఇక మిగతా ఏరియాలలో కూడా ఈ చిత్రానికి తొలిరోజున పెద్ద ఎత్తున వసూళ్ళు సాధించినట్టు తెలుస్తున్నది.

ఏదేమైనా మహేష్ కి మంచి హిట్ వచ్చినందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS