సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'భరత్ అనే నేను'. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంపై పలు రకాల గాసిప్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. అయితే ఆ గాసిప్స్‌పై చిత్ర యూనిట్ స్పందించింది. ముఖ్యంగా చిత్ర నిర్మాత అయిన డీవీవీ దానయ్య 'రాజకీయాల మీదే సినిమా తీశాం కానీ, ఏ రాజకీయ పార్టీని కించపరిచేలా ఉండదు నేను హామీ ఇస్తున్నాను. ఇది ప్రతీ ఒక్కరూ చూడాల్సిన సినిమా. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వబోతున్నాం. మహేష్ కెరీర్‌లో 'శ్రీమంతుడు' పెద్ద హిట్. అంత కంటే పెద్ద హిట్ అవుతుంది 'భరత్ అనే నేను'.. నాది గ్యారంటీ..' అని దానయ్య అన్నారు.
వివాదాల కోసం సినిమా తెరకెక్కించలేదు. దయచేసి ఎలాంటి గాసిప్స్‌ని నమ్మొద్దు. కుటుంబమంతా కలిసి కూర్చుని చూసే చక్కని సినిమా ఇది. సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ ఆలోచిస్తారు. సమాజం పట్ల బాధ్యత పెంచుకుంటారు అని భరోసా ఇస్తోంది భరత్ టీమ్. కొరటాల శివ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. సినిమా చాలా రిచ్‌గా తెరకెక్కించారనీ చిత్ర యూనిట్ చెబుతోంది.
ఈ నెల 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ 'భరత్ అనే నేను'. సూపర్‌స్టార్‌కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ నటిస్తోంది. ఈ సినిమాలో సూపర్‌స్టార్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నారు.