టాలీవుడ్‌లో సునామీలా విరుచుకుపడుతోన్న శ్రీరెడ్డి ఆరోపణల పర్వం ఇప్పుడు పవన్ కళ్యాణ్‌దాకా వచ్చింది. పవన్‌పై అసభ్యకరమైన ఆరోపణలు చేయడంతో, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి శ్రీరెడ్డి టార్గెట్ అయ్యింది. ఆయనపై చేసిన అనవసర ఆరోపణలకు గాను ఆమెపై కేసులు నమోదు చేస్తామంటూ పవన్ ఫ్యాన్స్ ఆందోళన చేస్తున్నారు.
ఆల్రెడీ సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఎలాగూ ఉంది. ఇది కాక, లీగల్‌గా ప్రొసీడ్ అవ్వాలని వారు నిర్ణయించుకున్నారట. అయితే శ్రీరెడ్డి కేసులకు లొంగే రకమేనా? నిగూఢంగా ఉన్న చర్యలన్నీ, ఇప్పుడు శ్రీరెడ్డి నోట్లో నుండి విచ్చలవిడిగా బయటికి వచ్చేస్తున్నాయి. ఆర్టిస్టులం. తెలుగు వాళ్లం. అవకాశాలు రావట్లేదు అంటూనే, శ్రీరెడ్డి నోరు జారేసింది. వ్యభిచారాన్ని బ్యాన్ చేశారు. మేమిప్పుడు ఎలా బతకాలి? అని నిలదీసింది. దాంతో శ్రీరెడ్డిపై లేని పోని అనుమానాలు రేకెత్తేందుకు ఆస్కారం ఏర్పడింది. ఆమెపై కేసుల బలీయం చేసేందుకు మార్గం సులభతరమైంది.
అసలు వ్యభిచారానికి శ్రీరెడ్డికి లింకేంటి? అదేనా, బుల్లితెరపై యాంకరింగ్ చేసుకుందామా అంటే, మంచు లక్ష్మీప్రసన్న వంటి వారు అక్కడ కూడా మాకు అవకాశాలు లేకుండా చేశారు.. అంటూ మంచు ఫ్యామిలీని కూడా టచ్ చేసేసింది. మరిప్పుడు శ్రీరెడ్డి పరిస్థితేంటబ్బా. ఇంతవరకూ చేసిన ఆరోపణలన్నీ ఒకెత్తు, ఇప్పుడు కొత్తగా శ్రీరెడ్డి విజృంభిస్తున్న దారి మరో ఎత్తు. ఎన్ని ఎత్తులేసినా, శ్రీరెడ్డి చిత్తు కావడం తప్పదేమో అనిపిస్తోంది. చూడాలి ఇకపై ఏం జరనుందో.!