రికార్డు స్థాయిలో భరత్ అనే నేను శాటిలైట్ రైట్స్

By iQlikMovies - June 06, 2018 - 12:20 PM IST

మరిన్ని వార్తలు

సూపర్ స్టార్ మహేష్ బాబుకి వరుస ఫ్లాపుల నుండి భరత్ అనే నేను చిత్రం ఆయనని బయటపడేసింది. ఇక ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద తన ప్రతాపం చూపెట్టడంతో సుమారు రూ 200 కోట్లకు (గ్రాస్) పైగా వసూళ్ళు సాధించింది.

ఇదే సమయంలో ఈ చిత్రం శాటిలైట్ రైట్స్ కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. అందుతున్న సమాచారం ప్రకారం, సుమారు రూ 22 కోట్లకు పైగా చెల్లించి ఒక ప్రముఖ టీవీ ఛానల్ ఈ చిత్రం తాలుకా రైట్స్ ని సొంతం చేసుకున్నదట. ఇంత మొత్తంలో ఓ తెలుగు సినిమాకి (బాహుబలి 1 & 2 కాకుండా) శాటిలైట్ రైట్స్ రావడం ఒక రికార్డు అనే చెప్పాలి.

ఈ రైట్స్ అమ్ముడవ్వడంతో త్వరలోనే ఈ చిత్రం టెలివిజన్ ప్రీమియర్ ఉండొచ్చు, ఇది సూపర్ స్టార్ ఫ్యాన్స్ కి కచ్చితంగా ఆనందాన్నిచ్చే వార్తే.. ఇదిలావుండగా మహేష్ బాబు ఈ నెల నుండే తన 25వ చిత్రాన్ని వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మొదలుపెట్టనున్నాడు.

ఈ చిత్రం ఆయనకి మరో బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుందాం...

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS