తెలుగు ప్రేక్షకులకు కూడా ఒక ప్రత్యేక ఒటీటీ ఉండాలనే ఆలోచనతో 'ఆహా' స్థాపించారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ బ్రాండ్ అబాసిండర్ గా ప్రచార బాధ్యతలు తీసుకున్నారు. తక్కువ కాలంలోనే ఆహాకి జనాల్లోకి వెళ్ళింది. మొదట్లో ఆహాలో చాలా వరకు డబ్బింగ్ సినిమాలే.
తర్వాత కొంచెం కొంచెంగా ఒరిజినల్ కంటెంట్ బిల్డప్ చేశారు. తర్వాత మీడియం సినిమాలు హక్కులు సొంతం చేసుకున్నారు. అయితే ఇప్పటివరకూ ఓ పెద్ద సినిమా ఆహాలో రాలేదు. ఆహా పెట్టిన తర్వాత అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' లాంటి సూపర్ హిట్ చేశాడు. ఆ సినిమా ఆహాలో వచ్చివుంటే అదో స్పెషల్ ఎట్రాక్షన్ వుండేది. ఈ మధ్య వచ్చిన పుష్ప విషయానికి వస్తే పాన్ ఇండియా సినిమా కావడంతో అన్నీ భాషలు కలిపి అమోజాన్ కి ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆహాలో ఓ పెద్ద సినిమా చేరింది. అదే పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్. భీమ్లా నాయక్ హక్కులని భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకుంది ఆహా. ఈ వారంలోనే ఆహాలో విడుదల తేదిని ప్రకటించనున్నారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ రూపంలో ఆహాలో ఓ మెగా ఎట్రాక్షన్ చేరింది.