'భీమ్లా నాయక్' బావుందని అంటున్నారే గానీ.. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తో పోల్చుకుంటే ఎక్కడో చిన్న అసంతృప్తి. కారణం.. సినిమా కాన్వాస్. పవన్ కళ్యాణ్ సినిమా కాన్వాస్ సరిపోయే కథ కాదు భీమ్లా నాయక్. త్రివిక్రమ్ తెలివిగా.. ఒక ఫ్లాష్ బ్యాక్ పెట్టి 'ఇచ్చిన మాట కోసం' అంటూ తన మాటతో కొంచెం ఎమోషనల్ ఎండింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు కానీ ఒరిజినల్ గా చూసుకుంటే.. ఒక ఈగోయిస్ట్ తో వైరం పెట్టుకుని ఉద్యోగం పోగుట్టుకున్న పోలీసు.. మళ్ళీ ఉద్యోగం తెచ్చుకుంటాడు. దిన్ని అలానే తీసివుంటే.. పవన్ కళ్యాణ్ కి ఇంతకంటే కథ దొరకలేదా? అనే ఫీలింగ్ వచ్చేది. చివర్లో 'ఇచ్చిన మాట కోసం' అనే ముగింపు పలికి ఎమోషనల్ గా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయారు.
ఇప్పుడిదంతా ఎందుకంటే .. పవన్ కళ్యాణ్ మరో రీమేక్ చేస్తారని వార్తలు వస్తున్నాయి. దర్శకుడు సముద్రఖని తీసిన'' వినోదయ చిత్తం' పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తారనే వార్త జోరుగా ప్రచారం జరుగుతుంది. నిప్పు లేనిది పొగ రాదు. ఈ సినిమా గురించి రీమేక్ చర్చలైతే జరుగుతుంటాయి. అయితే అది పవన్ కళ్యాణ్ విషయంలో జరగడం ఫ్యాన్స్ కి టెన్షన్ పట్టుకుంది. కారణం 'వినోదయ చిత్తం' కథ. చాలా మంచి కథ. డిఫరెంట్ ఫాంటసీ.
''ఒక బొమ్మరిల్లు ఫాదర్. అన్ని తాను అనుకునట్లే సమయానికి జరుగుతున్నాయని భావించే అతను సడన్ గా కార్ యాక్సిడెంట్ లో పోతాడు. స్వర్గానికి నరకాని మధ్య ''అయ్యో.. తాను కుటుంబానికి చేయాల్సిన పనులు చాలా మిగిలిపోయాయే అని గింజుకుంటాడు. అప్పుడు సమయం ఓ మనిషి రూపంలో ప్రత్యేక్షమై .. ''నీవు లేకపోయినా నీ కుటుంబం ఆగిపోదు. కావాలంటే నీకో మూడు నెలలు సమయం ఇస్తా. వెళ్లి చూడు'' అని చెప్తాడు. మళ్ళీకుటుంబం దగ్గరికి వెళ్లిన వ్యక్తికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. సమయం అతడి జీవితంలో ఎలాంటి పాత్ర పోషించిందనేది కథ.
నిజానికి ఇది మంచి కథ. అయితే ఇది పవన్ కళ్యాణ్ కి ఎలా మ్యాచ్ చేస్తారనేది ఇక్కడ ప్రశ్న. సముద్రఖని పోషించిన సమయం పాత్ర పవన్ కళ్యాణ్ తో వేయిస్తే అతడు నిలబడి యాంకర్ లా మాట్లాడటం తప్పితే చేయడనికి ఏమీ లేదు. ఈ రీమేక్ కి కూడా త్రివిక్రమే మాటలు స్క్రీన్ రాస్తారని ప్రచారం జరుగుతుంది. ఒక వేళ రీమేక్ ఇచేస్తే కేవలం ఐడియాని మాత్రమే తీసుకొని మిగతా అంతా మార్చేయాలి. సమయం పాత్రకి సూపర్ పవర్లు ఇచ్చి, ఆ పాత్రని గ్యాలరీకి ప్లేయ్ చేయాలి. అప్పుడే ఇది పవన్ కళ్యాణ్ కి వర్క్ అవుట్ అవుతుంది. లేదంటే కష్టం.