పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళంలో ఘన విజయం సాధించిన అయ్యప్పయునుమ్ కోషియమ్ కి ఇది రీమేక్. రానా కీలక పాత్ర పోషించిన ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకుడు. ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ కుదర్లేదు. అయితే ఈ సినిమాకి రెండు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేశారు. ఫిబ్రవరి 25 లేదా? ఏప్రిల్ 1న తీసుకురావాలని నిర్ణయించుకున్నారు. చిత్రబృందం అయితే ఫిబ్రవరి 25న ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఫిక్సయ్యారు. ఫ్యాన్స్ కూడా.. ఫిబ్రవరి 25నే ఈ సినిమా వస్తుందని ఆశ పడుతున్నారు.
కానీ భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25న రావడం కష్టమే. ఎందుకంటే... ఈ సినిమాకి సంబంధించిన ఓ పాట మిగిలే వుంది. ప్రస్తుతం ఆ పాటే తెరకెక్కిస్తున్నారు. ఆ పాట పూర్తవ్వాలి.. ఆ పాటకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ అవ్వాలి.. ప్రమోషన్లు మొదలెట్టాలి.. ఇలా చాలా తతంగం ఉంది. పది రోజుల్లో ఇవన్నీ పూర్తవ్వడం దాదాపు అసాధ్యం. అందుకే.. ఈ సినిమా ఏప్రిల్ కి షిఫ్ట్ అయిపోయిందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రమోషన్లకు పెద్దగా సమయం తీసుకోవాల్సిన అవసరం లేదని చిత్రబృందం భావిస్తే గనుక.. ఫిబ్రవరి 25నే భీమ్లా వస్తాడు. నిజంగా భీమ్లా వచ్చేస్తే.. ఆరోజున విడుదల కావాల్సివున్న శర్వానంద్ సినిమా `ఆడవాళ్లూ మీకు జోహార్లు` వాయిదా పడుతుంది.