భీమ్లా నాయక్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. ఈ సినిమా ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. లేటెస్టుగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించారు. కానీ ఇప్పటికీ ఈ సినిమా విడుదల డైలామాలోనే ఉన్నట్టు టాక్. ఏపీలో టికెట్ రేట్ల వ్యవహారం నలుగుతూనే ఉంది.
ఈవారంలోనే.. టికెట్ రేట్ల పెంపు విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న టికెట్ రేట్లనే కొనసాగించడానికి ఏపీ ప్రభుత్వం మొగ్గు చూపిస్తోందన్నది అంతర్గత వర్గాల సమాచారం. పైగా.. కరోనా కేసుల్లో పెద్దగా మార్పులేం రాలేదు.
50 శాతం ఆక్యుపెన్సీ నిబంధన ఇంకా కొనసాగుతూనే ఉంది. అందుకే ఈ సినిమాని నేరుగా ఓ టీటీలోకి విడుదల చేసేయమని పవన్ కల్యాణ్ సలహా ఇచ్చాడట. మంచి రేటు వస్తే - ఓటీటీకి ఇవ్వాలని, అలా ఇస్తే.. ఏపీ ప్రభుత్వం సృష్టించే ఇబ్బందుల నుంచి తప్పించుకోవచ్చని పవన్ చెప్పాడట. దాంతో నిర్మాతలు ఈ దిశగా తమ ప్రయత్నాలు మొదలెట్టారని టాక్. ఇప్పటికే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ సంస్థలతో భీమ్లా నాయక్ నిర్మాత సంప్రదింపులు జరుపుపతున్నారని, ఆఫర్ టెమ్టింగ్ గా ఉంటే ఈ సినిమా ఓటీటీకి వెళ్లిపోతుందని సమాచారం అందుతోంది.