నితిన్ తాజా చిత్రం 'భీష్మ' ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. మస్త్ రొమాంటిక్. గురువు పవన్ కళ్యాణ్‌ని మించి పోయాడు మనోడు. హీరోయిన్ రష్మికా మండన్నా నడుము చూసి తెగ మెలికలు తిరిగేశాడు. 'నా లవ్వు కూడా విజయ్ మాల్యా లాంటిదేరా.. కనబడుతుంది కానీ, క్యాచ్ చేయడం కష్టం..' అంటూ లాజికల్‌గా ఓ డైలాగ్ చెప్పాడు. ఒక రెస్టారెంట్లో నడుచుకుంటూ వెళుతున్న హీరోయిన్ నడుముని వెనక నుండి క్యాచ్ చేయాలనుకుంటాడు హీరో. ఆఖరికి క్యాచ్ చేసేస్తాడనుకోండి. హీరో టచ్ తగిలిన హీరోయిన్ వెనక్కి తిరిగి చూడగా 'చించేశావ్..' అనే మీనింగ్ వచ్చేలా ఓ సైన్ చూపిస్తాడు హీరో. బ్యాక్ గ్రౌండ్లో ఆహ్లాదమైన మ్యూజిక్ చెవులకు ఇంపుగా వినిపిస్తోంది. అదీ ఫస్ట్ గ్లింప్స్ సారాంశం.
శారీలో రష్మికా మండన్నా చాలా క్యూట్ అండ్ సెక్సీగా కనిపించింది. సూట్లో చాలా స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు నితిన్. వెంకీ కుడుముల ఈ సినిమాకి దర్శకుడు. గతంలో 'ఛలో' సినిమాకి దర్శకత్వం వహించారీయన. ఫస్ట్ గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే వ్యూస్ పోటెత్తుతున్నాయి. అయితే, ఈ సినిమాని మొదట్లో డిశంబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నారు. కానీ, వచ్చే ఏడాది ఫిబ్రవరికి రిలీజ్ డేట్ మార్చేశారు.