దర్శకుడు మెహర్ రమేష్‌కి ఓ చేదు అనుభవం ఎదురైంది. అదీ.. ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గరే. ఇటీవల నమ్రత శిరోద్కర్ జగన్ నివాసానికి వెళ్లి వై.ఎస్ భారతిని కలుసుకున్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఆమెతో పాటు మెహర్ రమేష్ కూడా ఉన్నారు. మహేష్ కుటుంబానికి సంబంధించిన ఏ వ్యవహారంలోనైనా మెహర్ హాజరు తప్పని సరి. దాంతో.. ఆయన జగన్ ఇంటికి నమ్రతతో సహా హాజరయ్యారు. కానీ.. సెక్యురిటీ మాత్రం మెహర్ రమేష్‌ని లోపలికి పంపలేదని సమాచారం.
`మీ పేరు ముందస్తుగా చెప్పలేదు. అందుకే మీకు ప్రవేశం లేదు` అని జగన్ వ్యక్తిగత సిబ్బంది మెహర్ రమేష్‌ని అడ్డుకున్నారని సమాచారం. దాంతో మెహర్ రమేష్, సెక్యురిటీ సిబ్బందితో కాసేపు వాగ్వివాదం చేశార్ట. అయినా సరే.. `సీఎం ఇంటి ముందు ఎవరైనా ఒకటే` అని గట్టిగా చెప్పడంతో మెహర్ కాస్త అసహనానికి గురై, అక్కడి నుంచి వచ్చేశారని సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్లో ఇదే విషయం హాట్ టాపిక్‌గా మారింది.