వరుస ఫ్లాపుల తరవాత నితిన్ నుంచి ఓ సినిమా వచ్చింది. అదే... `భీష్మ`. రష్మిక కథానాయికగా నటించిన ఈ చిత్రానికి వెంకీ కుడుముల దర్శకుడు. ముందు నుంచీ ఈ సినిమాపై పాజిటివ్ బజ్ నడిచింది. తొలి షో అవ్వగానే హిట్ టాక్ మొదలైపోయింది. మౌత్ టాక్తో.. ఈ సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ వైపుగా దూసుకుపోతోంది. దానికి తగ్గట్టే తొలి రోజు వసూళ్లు అదిరిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ కలిసి భీష్మ తొలిరోజున 6.3 కోట్ల షేర్ సాధించింది. నితిన్ కెరీర్లోనే ఇది రికార్డు. ఇంతకు ముందు `అ.ఆ` 5.5 కోట్లు తెచ్చింది. అయితే `అ.ఆ` త్రివిక్రమ్సినిమాగా చలామణి అయ్యింది. అందుకే ఆ క్రెడిట్ ఆయనకు వెళ్లింది. ఈసారి మాత్రం నితిన్ పూర్తిగా తన మైలేజీతో ఈ మొత్తం సంపాదించినట్టు లెక్క.
నైజాంలో 2.21 కోట్లు, సీడెడ్లో 80 లక్షలు, గుంటూరులో 80 లక్షలు సంపాదించిన భీష్మ.. ఉత్తరాంధ్రలో 66 లక్షలు వసూలు చేసింది. ఈస్ట్, వెస్ట్, కృష్ణా కలిపి మరో 2 కోట్లు తెచ్చుకుంది. ఓవర్సీస్లో ఈ సినిమాకి భారీ లాభాలు వచ్చే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు లెక్కగడుతున్నాయి. శని, ఆదివారాలూ ఇదే జోరు కొనసాగిస్తే బయ్యర్లు అతి త్వరలోనే బ్రేక్ ఈవెన్లో పడిపోతారు.