'భీష్మ' కోసం డబ్బింగ్ చెప్పిన నితిన్ !

మరిన్ని వార్తలు

'ఛలో' దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా 'భీష్మ' చిత్రం రానున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇటివలే ఈ చిత్రం కోసం నితిన్ తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టారు. కాగా తాజాగా నితిన్ డబ్బింగ్ పూర్తి అయిందట. కాకపోతే మరి కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయని.. అవి ఇంకా షూట్ చేయాల్సి ఉందని... మిగిలిన షూటింగ్ కూడా పూర్తయ్యాక నితిన్ ఆ సీన్స్ కి కూడా డబ్బింగ్ చేబుతాడట.

 

ఈ చిత్రానికి 'సింగిల్ ఫరెవర్' అనేది ఉపశీర్షిక. 'ఛలో' మాదిరిగాగే ఈ చిత్రాన్ని కూడా వెంకీ ఎంటెర్టైనింగా మలచనున్నాడట. ముఖ్యంగా వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ఇక నితిన్ లాస్ట్ సినిమా శ్రీనివాస కళ్యాణం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. దాంతో నితిన్, భీష్మ చిత్రం పై మరింత దృష్టి పెట్టారు. ఈ సినిమాలో హెబ్బా పటేల్‌ ఓ కీలక పాత్రలో కనిపించనుంది. సుకుమార్ నిర్మాణంలో వచ్చిన 'కుమారి 21 ఎఫ్' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ లో అందరి దృష్టిని ఆకర్షించింది హెబ్బా పటేల్‌. ఆ సినిమా హిట్ కారణంగా హెబ్బాకు ఆ తరువాత బాగానే అవకాశాలు వచ్చాయి. కానీ వరుస ప్లాప్ లతో ఈ అమ్మడికి ప్రస్తుతం ఛాన్స్ లు తగ్గాయి. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చిన సినిమానే 'భీష్మ'. అయితే హెబ్బా పాత్రలో ఎక్కువుగా నెగటివ్‌ షేడ్స్‌ ఉంటాయట.

 

మొత్తానికి ఈ సినిమాలో హెబ్బా లేడీ విలన్‌ గా నటిస్తోంది. మరి హెబ్బాకి ఈ చిత్రంతోనైనా ఆమె ఆశించిన బ్రేక్ ఆమెకు దక్కుతుందేమో చూడాలి. వెన్నల కిశోర్ అండ్ నితిన్ ట్రాక్ సినిమాలో హైలెట్ అవుతుందని సమాచారం. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై 'నాగ వంశీ' ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నితిన్ సరసన రష్మిక మందన్నా ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS