స్టార్ హీరోయిన్ తో అఖిల్ లవ్ సీన్స్ బాగా వస్తున్నాయట!

మరిన్ని వార్తలు

అక్కినేని అఖిల్ నాల్గవ చిత్రం సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నారు. అయితే 'మిస్టర్ మజ్ను' కూడా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది అక్కినేని అఖిల్ కి . దాంతో తన తరువాత సినిమా పై మరింత జాగ్రత్త పడుతున్నాడు అఖిల్. బొమ్మరిల్లు భాస్కర్ తో పాటు అఖిల్ కూడా దగ్గర ఉండి సినిమాకి సంబంధించి అన్ని పనులు చూసుకుంటున్నాడట.

 

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మూడు షెడ్యూల్స్ కూడా పూర్తి అయింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ కోసం దాదాపు సంవత్సరం నుండి అఖిల్ బాబు హీరోయిన్లను చూస్తూ... కియారా అద్వానీ, రష్మీక మండన్నా వంటి హీరోయిన్లను పరిశీలించి.. చివరికీ పూజా హెగ్డేను ఫైనల్ చేసిన సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో అఖిల్ - పూజా హెగ్డేల మధ్య కొన్ని లవ్ సీన్స్ చాల బాగా వస్తున్నాయట.

 

ఈ సినిమా కూడా బొమ్మరిల్లు భాస్కర్ సినిమాలో లాగానే బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు లవ్ స్టోరీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందట. ఇక ఈ సినిమాను గీతా ఆర్ట్స్ నే నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్నారు. మరి భాస్కర్ తో చెయ్యబోయే సినిమాతోనైనా అఖిల్ భారీ విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి. ప్రస్తుతం పరుశురామ్ - అఖిల్ కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. కొత్త డైరెక్టర్ అనిల్ అఖిల్ కోసం స్క్రిప్ట్ పనులు పూర్తి చేశారట.. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్ళటానికి చూస్తున్నారు. అన్నట్లు ఈ సినిమాకి నాగార్జున నిర్మాతగా వ్యవహరించనున్నారు. మరి కొత్త డైరెక్టర్ తో చేయబోయే తన తరువాత సినిమాతో కూడా అఖిల్ హిట్ కొడతాడేమో చూడాలి.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS