నితిన్ తాజా చిత్రం ‘భీష్మ’ మ్యూజిక్ ట్రెండిరగ్ అవుతోంది. ‘వాట్ ఏ బ్యూటీ..’ అంటూ వచ్చిన ఫస్ట్ సింగిల్, ఆ తర్వాత ‘సరాసరి..’ అంటూ సాగే మరో సాంగ్.. యూత్‌ని ఓలలాడిరచేశాయి. ఇక ఇప్పుడు లవర్స్‌డేకి యాప్ట్ అయ్యేలా వదిలిన ‘సింగిల్ యాంథమ్’ కిర్రాక్ పుట్టిస్తోంది. రెట్రో లుక్స్‌లో నితిన్ అదరగొట్టేశాడు. ఈ సాంగ్ మేకింగ్ ఆధ్యంతం ఇంట్రెస్టింగ్‌గా సాగింది. స్కూల్ డేస్ నుండి, కాలేజ్, ఉద్యోగం.. ఇలా ఎక్కడైనా బ్యాచ్‌లర్ కష్టాలు ఎలా ఉంటాయో నితిన్ తన మ్యానరిజమ్ ద్వారా ఫన్నీగా చూపించాడు. మణిశర్మ వారసుడు మహతి సాగర్ స్వరపరిచిన సంగీతం తొలి సాంగ్ నుండీ ఆకట్టుకుంటోంది.
మొదటి పాట ఓ ఎత్తయితే, లేటెస్ట్ సాంగ్ మరో ఎత్తు అనేలా ఉంది. ట్యూన్స్‌తో పాటు, విజువల్ కూడా అద్భుతంగా ఉంది. లవర్స్‌డేకి నితిన్ పర్‌ఫెక్ట్ గిఫ్ట్ ఇచ్చాడు ఈ యాంథమ్‌తో. ముఖ్యంగా బ్యాగీ ప్యాంట్ ధరించి రెట్రో లుక్స్‌లో నితిన్ వేసిన గిటార్ స్టెప్ అయితే, యూత్‌కి కితకితలు పెట్టిస్తోంది. ఈ వీడియాలో నితిన్ తన దేవుడు పవన్ కళ్యాణ్‌తో పాటు, పెద్దన్న చిరంజీవిని కూడా వాడేశాడు. స్కూటర్‌లో వస్తూ ధరించిన ఓ షర్టు అప్పుడెప్పుడో ఓ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ధరించిన షర్టులా ఉండడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలోని పాపులర్ సీన్‌ని కూడా ఈ పాట కోసం వాడేశాడు నితిన్. టోటల్‌గా హీరోయిన్ లేదు కానీ, అంతకు మించిన ల వ్ ఫీల్ ని ఈ వీడియోలో చూపించి కేక పుట్టించాడీ రొమాంటిక్ ‘భీష్మ’.