స్టార్ హీరోల సరసన నటించి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది భూమిక. భరత్ ఠాకూర్‌ని పెళ్లాడి... ఆ తరవాత నిర్మాతగానూ మారింది. కొంతకాలంగా నటనకు దూరంగా ఉంటోంది. ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ ఇస్తోందట. అందులోనూ నాగార్జున సినిమాలో. నాగార్జున నటించే కొత్త చిత్రం `బంగార్రాజు`.
సోగ్గాడే చిన్ని నాయిన చిత్రానికి ఇది ప్రీక్వెల్. కల్యాణ్ కృష్ణ దర్శకుడు. ఇందులో ఓ కీలకమైన పాత్రకు భూమికని తీసుకున్నార్ట. నాగ్ - భూమిక కలిసి నటించడం ఇది రెండోసారి. ఇది వరకు `స్నేహంంటే ఇదేరా`లో ఇద్దరూ జోడీ కట్టారు. ఆసినిమా ఫ్లాప్ అయ్యింది. ఇన్నాళ్లకు మళ్లీ ఇద్దరూ కలుస్తున్నారు. `సోగ్గాడే..`లో రమ్యకృష్ణ నాగ్ కి భార్యగా నటించింది. ఇప్పుడు ఆ పాత్రలో భూమిక నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.