గ్లామ్‌షాట్‌: సాయంకాలానా.. సాగర తీరానా జలకాలాటలలో..!

By Inkmantra - January 02, 2020 - 18:00 PM IST

మరిన్ని వార్తలు

'పతీ పత్నీ ఔర్‌ ఓ', శాండ్‌ కీ ఆంఖ్‌' తదితర చిత్రాలతో 2019లో తెగ సందడి చేసింది బాలీవుడ్‌ బ్యూటీ భూమి పడ్నేకర్‌. సినిమాల్లో అవకాశాలు ఆచి తూచి స్వీకరించినా, గ్లామరస్‌ పాత్రల్లో మెరిసిపోవడానికి ఎంత మాత్రమూ సంకోచించదీ హాట్‌ బ్యూటీ. పాపలో చాలా చాలా గ్లామర్‌ యాంగిల్స్‌ ఉన్నాయి. అయితే, ఈ మధ్య విలక్షణ పాత్రలతో మెప్పిస్తోంది భూమి పడ్నేకర్‌. డీ గ్లామర్‌ రోల్స్‌తోనూ ఆకట్టుకుంది. అందుకే, న్యూ ఇయర్‌లో సరికొత్త అందాలతో రెచ్చిపోవాలనుకుంది కాబోలు.

 

తనలోని గ్లామర్‌ సెగలను కొత్త కొత్తగా ప్రొజెక్ట్‌ చేస్తూ, బికినీ పోజులతో రెచ్చిపోయింది. గ్రీన్‌ కలర్‌ టూ పీస్‌ బికినీలో సాగర తీరాన భూమి పడ్నేకర్‌ చేసిన స్కిన్‌ షోకి నెటిజన్లు శాంతం ఫిదా అయిపోతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ, బీచ్‌లో జల క్రీడలాడుతున్న భూమి అందాల్ని తనివి తీరా తాకాలని పాల నురుగుల్లాంటి సాగార జలాలు రెట్టించిన ఉత్సాహం నింపుకుని మరీ ఎగసి పడుతున్నాయి. ఆ అలల మధ్యన భూమి లేలేత సోయగాలు మంత్ర ముగ్ధుల్ని చేస్తున్నాయి. న్యూ ఇయర్‌లో ఏంటీ బికినీ సెగలు.? అని ఆశ్చర్యపోయేంతలా భూమి దడదడలాడించేస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My Mood for the next decade 🏖 💃🏻🧚🏻‍♀️😊 #HappyGirl #HappyNewYear #2020 #mood

A post shared by Bhumi✨ (@bhumipednekar) on

చేసిన సినిమాలు తక్కువే అయినా, అన్నీ సక్సెస్‌ఫుల్‌ ప్రాజెక్టులే. గతంలో 'టాయిలెట్‌ - ఏక్‌ ప్రేమ్‌ కథ', 'శుభ్‌ మంగళ్‌ సావధాన్‌' వంటి అడల్ట్‌ కామెడీ చిత్రాలు భూమికి మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. ఇక కొత్త సంవత్సరంలోనూ భూమి నుండి రెండు మంచి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అందాకా ఖాళీగా ఏం ఉంటారు.. ఇదిగో ఈ బికినీ హొయల్ని చూసి తరించడం మర్చిపోకండే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS