సెగలు పుట్టిస్తోన్న 'టాయిలెట్‌' బ్యూటీ

By iQlikMovies - July 02, 2018 - 12:41 PM IST

మరిన్ని వార్తలు

'టాయిలెట్‌' సినిమాతో మంచి పేరు దక్కించుకున్న బ్యూటీ భూమీ పడ్నేకర్‌. నేచురల్‌ బ్యూటీనెస్‌తో, యాక్టింగ్‌ టాలెంట్‌ ప్రదర్శించిందీ ముద్దుగుమ్మ. ఆ తర్వాత 'శుభ్‌ మంగళ్‌ సావధాన్‌' చిత్రంతోనూ ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి నటిగా మంచి పేరు దక్కించుకుంది. ఇకపోతే లేటెస్టుగా హాట్‌ హాట్‌ చర్చల్లో నిలిచిన వెబ్‌ సిరీస్‌ 'లస్ట్‌ స్టోరీస్‌'లోనూ భూమీ పడ్నేకర్‌ నటించింది. ఈ సిరీస్‌లోని నాలుగు ఇంపార్టెంట్‌ స్టోరీస్‌లో ఒక స్టోరీ భూమీ పడ్నేకర్‌ది. ఈ మూడు చిత్రాలూ వరుసగా అడల్ట్‌ కంటెన్ట్‌ మూవీసే. అయినా నటనకు ప్రాధాన్యత ఉండడంతో పాటు, సక్సెస్‌ మూవీస్‌గా కూడా నిలవడంతో, భూమీ పడ్నేకర్‌ కెరీర్‌లో ఇవి చెప్పుకోదగ్గ చిత్రాలనడం అతిశయోక్తి కాదు. ఇకపోతే, ఈ సినిమాల్లో కంటెన్ట్‌ అడల్ట్‌ కంటెన్ట్‌ అయినప్పటికీ, అమ్మడు మాత్రం ఎక్స్‌పోజింగ్‌లో పెద్దగా హద్దులు మీరింది లేదనే చెప్పాలి. అందుకేనేమో సోషల్‌ మీడియాలో ఇలా హాట్‌ పోజులతో కుర్రకారుకు పిచ్చెక్కించేస్తోంది.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS