పూజా హెగ్దే మళ్లీ రిస్క్‌ చేసేస్తోందా?

By iQlikMovies - July 02, 2018 - 12:39 PM IST

మరిన్ని వార్తలు

ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్దే. స్టార్‌ హీరోలందరి సరసన అవకాశాలు దక్కించుకుంటూ రాకెట్‌ స్పీడుతో దూస్కెళ్లిపోతోంది. ఇలాంటి తరుణంలో ఈ ముద్దుగుమ్మకు బాలీవుడ్‌ నుండి పిలుపొచ్చిందట. 

బాలీవుడ్‌లో అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటిస్తున్న 'హౌస్‌ఫుల్‌ 4' సినిమాలో పూజాహెగ్దే హీరోయిన్‌గా ఎంపికైందట. 'హౌస్‌ఫుల్‌' సిరీస్‌లో వచ్చిన సినిమాలన్నీ మంచి సక్సెస్‌ అందుకున్నాయి. అలాంటిది ఈ సిరీస్‌ సినిమాలో అదీ అక్షయ్‌ కుమార్‌ వంటి స్టార్‌ హీరో పక్కన ఛాన్స్‌ అంటే అది గోల్డెన్‌ ఛాన్సే. 

కానీ, ప్రస్తుతం తెలుగులో అవకాశాలు పోటెత్తుతున్న ఈ తరుణంలో బాలీవుడ్‌లో ఛాన్స్‌ అంటూ కాస్త కష్టమే అని చెప్పాలి. టాలీవుడ్‌లో అవకాశాలు వదులుకోవాల్సి వస్తుంది. తొందరలోనే స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోవడానికి దగ్గరగా ఉన్న టైంలో పూజా హెగ్దే బాలీవుడ్‌ వైపు దృష్టి పెట్టి, పెద్ద రిస్కే చేస్తోందేమో అని ఆమె అభిమానులు భావిస్తున్నారు. 

తెలుగులో 'ముకుందా'తో మంచి హిట్‌ కొట్టి, బాలీవుడ్‌కెళ్లిన పూజా హెగ్దే అది డిజాస్టర్‌ కావడంతో మళ్లీ తెలుగులో నిలదొక్కుకోవడానికి ఇంత టైం పట్టింది. ఇప్పుడిప్పుడే పాపులర్‌ అవుతోంది. ఈ తరుణంలో మళ్లీ బాలీవుడ్‌ నుండి ఛాన్స్‌ వచ్చింది కదా అని ముందూ వెనకా ఆలోచించకుండా పలాయనం చిత్తగిస్తే, ఫ్యూచర్‌ ఎలా ఉంటుందో చెప్పలేం కదా. ఈ విషయంలో మన జిగేల్‌ రాణీ కాస్త ఆచి తూచి వ్యవహరిస్తే బావుంటుందేమో.!

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS