ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా విషయంలో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికంతటికీ కారణం త్రివిక్రమ్ ఖాతాలో లేటెస్టుగా చేరిన 'అజ్ఞాతవాసి' డిజాస్టర్.
దీంతో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ రిస్క్ చేస్తున్నాడంటూ రకరకాల కామెంట్స్ పెడుతున్నారు. త్రివిక్రమ్‌తో ఎన్టీఆర్ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేది లేదనీ, అసలు ఎన్టీఆర్‌కే ఈ ప్రాజెక్ట్‌ని టేకప్ చేసేందుకు ప్రస్తుతం ఇంట్రెస్ట్ లేదనీ, గాసిప్స్ వినిపిస్తున్నాయి. అయితే మరో పక్క ఎన్టీఆర్ ఈ సినిమా కోసం తనను తాను సంసిద్ధం చేసుకుంటున్నాడు. వర్కవుట్స్ చేసి, ఇప్పటికే బరువు తగ్గి, ఫిట్‌గా తయారయ్యాడు.
అంతేకాదు, త్రివిక్రమ్‌పై తనకు నమ్మకం ఉందనీ, ఖచ్చితంగా హిట్ కొడతామనీ, ఈ విషయంలో అభిమానులు ఏమాత్రం డిజప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదనీ ఎన్టీఆర్ అభిమానులకు సూచిస్తున్నాడట. అయినా కానీ 'టెంపర్' తర్వాత 'నాన్నకు ప్రేమతో..', జనతా గ్యారేజ్' వంటి వరుస విజయాలతో దూస్కెళ్తోన్న ఎన్టీఆర్‌కి 'జై లవకుశ' రూపంలో చిన్న హెచ్చరిక తగిలింది.
అలాంటిది ఈ టైంలో ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమా అంటూ ఇలాంటి రిస్క్ చేయడం పట్ల అభిమానులు టెన్షన్ పడడంలో అర్ధముంది కానీ, అలా అని ఎన్టీఆర్‌ని, త్రివిక్రమ్‌ని అంత తక్కువగా అంచనా వేయలేం కదా. అసలే పండితుడు, మేధావి అయిన త్రివిక్రమ్ ఓ సారి దెబ్బ తిన్నాక జాగ్రత్త పడకుండా ఉంటాడా? ఖచ్చితంగా ఎన్టీఆర్ సినిమా ఇప్పుడు త్రివిక్రమ్‌కి ప్రెస్టీజియస్ ఇష్యూనే అని చెప్పాలి.