బాలయ్య మూవీలో భూమిక?

మరిన్ని వార్తలు

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్‌.రవికుమార్‌తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇటీవలే స్టార్ట్‌ అయ్యి తొలి షెడ్యూల్‌ షూటింగ్‌ కూడా ప్రారంభమైంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఇద్దరు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. అందులో ఒకరు వేదిక కాగా, ఇంకొరు ఆల్రెడీ బాలయ్యతో రెండు సినిమాల్లో నటించిన సోనాల్‌ చౌహాన్‌. కాగా ఈ సినిమాలో బాలయ్య కోసం మరో ఇద్దరు ముద్దుగుమ్మల పేర్లు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు నమిత కాగా, ఇంకొకరు భూమిక అని తెలుస్తోంది.

 

ఆల్రెడీ నమిత 'సింహా'లో బాలయ్యతో నటించింది. 'సింహా' సూపర్‌ డూపర్‌ హిట్‌ సినిమా. ఈ సినిమాలో నమితతో బాలయ్య 'సింహమంటి కుర్రోడే..' సాంగ్‌ ఎవర్‌ గ్రీన్‌ హిట్స్‌ లిస్టులో ఉంటుంది. మాస్‌ ఆడియన్స్‌లో నమితకు పిచ్చి ఫాలోయింగ్‌ ఉంది. సో ఆ సెంటిమెంట్‌తో నమితను ఈ సినిమాలో ఓ స్పెషల్‌ సాంగ్‌ కోసం తీసుకోవాలనుకుంటున్నారట.

 

అయితే, భూమికను మాత్రం ఓ ఇంపార్టెంట్‌ రోల్‌ ఇవ్వనున్నారనీ తెలుస్తోంది. ఒకప్పుడు కమర్షియల్‌ హీరోయిన్‌గా మంచి గుర్తింపు దక్కించుకున్న భూమిక ఇటీవల 'సవ్యసాచి', 'ఎంసీఏ', 'యూ టర్న్‌' చిత్రాలతో సెకండ్‌ ఇన్నింగ్స్‌లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంటోంది. అలా బాలయ్య సినిమాలోనూ భూమిక కోసం ఓ మంచి క్యారెక్టర్‌ సిద్ధం చేశారట. ఈ విషయమై అఫీషియల్‌ క్లారిటీ రావాల్సి ఉంది. త్వరలో ఈ సినిమా షూటింగ్‌ బ్యాంకాక్‌లో జరగనుంది. సీకె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌లో సి. కళ్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS