హీరోయిన్‌గా ఒకప్పుడు స్టార్‌డమ్ సంపాదించిన ముద్దుగుమ్మ భూమిక ఇప్పుడు, అక్క, వదిన పాత్రలతో బిజీగా గడుపుతోంది. అయితే, భూమికలో మరో యాంగిల్ ఉందట. నెగిటివ్ రోల్స్‌లో కనిపించాలన్నది భూమిక కలట. ఆ కలను ఎప్పుడెప్పుడు నెరవేర్చుకోవాలా.? అని ఎదురు చూస్తోందట. అయితే, త్వరలోనే తన డ్రీమ్ నెరవేర్చుకునే సమయం వచ్చేసిందని అర్ధమవుతోంది. ఓ పెద్ద సినిమాలో భూమిక నెగిటివ్ రోల్‌లో కనిపించబోతోందట. ఆ సినిమా వివరాలు త్వరలోనే రివీల్ కానున్నాయి. ఇటీవల ‘రూలర్’ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ పోషించింది. తాజాగా గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సీటీమార్’లో కీలక పాత్రలో కనిపించనుంది.
తమన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో భూమిక ఓ స్టన్నింగ్ రోల్‌లో కన్పించబోతోందనీ తెలుస్తోంది. ఇలా ఒక్కటి కాదు, నిడివి తక్కువ ఉన్న పాత్రలు చాలానే ఒప్పుకుంటోంది భూమిక. నిడివి తక్కువ ఉన్నా పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటోంది. ఇక తన డ్రీమ్ రోల్ కోసమైతే, చాలా ఆసక్తిగా ఎదురు చూస్తోందట. ఆమె ఆసక్తి ఏమో కానీ, ఈ సీక్రెట్ రివీల్ చేసి, ఆడియన్స్‌లోనూ ఆసక్తి పెంచేసింది భూమిక. ఇంతకీ భూమిక పట్టిన ఆ బిగ్ ప్రాజెక్ట్ ఏంటీ.? ఎలాంటి నెగిటివ్ రోల్‌లో కనిపించబోతోంది.? అని ఆడియన్స్‌లో ఉత్కంఠ నెలకొంది. ఆ ఉత్కంఠకు తెర పడాంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.