సౌత్ ఇండియన్ సినిమాలలో వ్యాంప్ పాత్రల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న నటి భువనేశ్వరి. ఇప్పుడు ఆమె కొడుకు చేసిన పనికి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది.
వివరాల్లోకి వెళితే ఆమె కొడుకు మిథున్ శ్రీనివాసన్, కాలేజీలో లేడీ స్టూడెంట్ ని పెళ్ళిచేసుకోమని వేధిస్తూ వివాదంలో చిక్కుకున్నాడు. చెన్నై లోని అన్నా నగర్ లో ఉంటున్న ఓ యువతి తో పేస్ బుక్ లో స్నేహంగా ఏర్పడి, అది ప్రేమగా మారింది. ఆపై తనను వివాహం చేసుకోవాలని ఆమె పై ఒత్తిడి తెచ్చాడు.
తర్వాత ఆ అమ్మాయి ఇంటికి కూడా వెళ్ళి గోల గోల చేసాడు. అప్పటికీ ఆ అమ్మాయి ఒప్పుకోకపోవడంతో కాలేజీ కి వెళ్ళి అందరూ చూస్తుండగానే, ఆమె మీద అరవడం, ఆమె పంపిన మెసేజ్ లు పైకి చదివి వినిపించడం లాంటి పనులు చేసాడు.
మిధున్ చేసిన పనులకి పరువు పోయినట్టుగా భావించి, ఆమె వెంటనే పోలీస్ స్టేషన్ లో మిధున్ పై కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు మిథున్ ని అరెస్ట్ చేసి, విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. అతడిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.