వివిధ కారణాలతో మహేష్ కత్తి పేరు ఈమధ్య కాలంలో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. తాజాగా ఆయనపై ఒక కామెడీ రియాలిటీ షోలో హైపర్ ఆది సెటైర్ వేయడంతో ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది.
దీనికి సంబంధించి ఆయన ఒక టీవీ ఛానల్ చర్చా వేదికలో సైతం పాల్గొనటం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తయితే నిన్న రాత్రి జరిగిన లండన్ బాబులు స్పెషల్ ప్రీమియర్ షో సందర్భంగా హాస్యనటుడు హైపర్ ఆది-మహేష్ కత్తిలు కలిసి ఫోటోకి ఫోజ్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది.
మరి ఈ ఇద్దరు రాజీ పడ్డారా లేక ఊరికే ఫోటోకి ఫోజ్ ఇచ్చారా అనే విషయం తెలియాల్సిఉంది. ఇక ఈ ఫోటో మాత్రం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.