బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'బిగ్ బాస్-2' రానే వచ్చేసింది. సీజన్2 లో ఎన్టీఆర్ ప్లేస్ ని రీప్లేస్ చేస్తూ హోస్ట్ గా వచ్చిన నాని సూపర్ ఎనర్జీ తో సూపర్ ఎంట్రీ ఇచ్చాడు. అయితే హోస్ట్ గా నాని నటన కోసం కాస్త కష్టపడాల్సి వచ్చింది.
గత బిగ్ బాస్ లో అందరూ సెలబ్రిటీ లే ఉండటంతో, ఈ సారి సామాన్య ప్రజలని కూడా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయంతో, ఈ సారి 16మంది కంటెస్టెంట్స్ లో ముగ్గురు కామన్ పీపుల్ ని తీసుకున్నారు. ఇందులో సంజనా అన్నే అనే మోడల్ ని తీసుకోగా, మరో ఇద్దరు నూతన్ నాయుడు, గణేష్ లను కామన్ మేన్ కోటాలో ఎంపిక చేసారు.
అయితే అనుకోని విధంగా 'బిగ్ బాస్-2' తొలి ఎపిసోడ్ లోనే సెలబ్రిటీల నుండి కామన్ మేన్ కి షాక్ తగిలింది. 16మంది కంటెస్టెంట్స్ లో ఎవరైనా ఇద్దర్ని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు పంపేందుకు ఆదేశించడంతో, 15,16 కంటెస్టెంట్స్ గా వచ్చిన సంజనా అన్నే, నూతన్ నాయుడు ల పేర్లను సూచించడంతో.. వీరిని హౌస్ బయట ఉన్న జైల్లో ఉంచి తాళం వేశారు.
అయితే అంతమంది సెలబ్రిటీలు ఉన్న బిగ్ బాస్ హౌస్ లో సామాన్యులుగా వచ్చిన తమనే ఎన్నుకోవటం పట్ల ఫైర్ అయింది మోడల్ సంజనా. అయితే ఈ రోజు జరిగే రెండవ ఎపిసోడ్ లో ఇద్దరిలో ఒకరిని బయటికి పంపే అవకాశం ఉండటంతో, ఆ ఒకరు ఎవరా అన్న ఆసక్తి అభిమానుల్లో ఉత్కంఠ రేపుతున్నది.