నాని 'బిగ్‌బాస్‌-2' ఎలా వుందంటే!

మరిన్ని వార్తలు

స్లో అండ్‌ స్టడీ విన్స్‌ రేస్‌.. అన్న కాన్సెప్ట్‌ని నాని ఫాలో అవుతున్నట్లే కన్పించింది 'బిగ్‌బాస్‌' రియాల్టీ షో సీజన్‌ 2 ప్రారంభం చూస్తే. నిన్ననే ఈ షో లాంఛనంగా ప్రారంభమయ్యింది. పార్టిసిపెంట్స్‌ పరిచయం జరిగింది. ఇందులో 'ఇంట్రెస్టింగ్‌ సెలబ్రిటీ' అనేవారు ఎవరూ లేరనే అభిప్రాయాలు చాలామంది నుంచి వ్యక్తమవుతున్నాయి. 

హోస్ట్‌గా నాని సైతం ఫస్ట్‌ ఎపిసోడ్‌లో మరీ హుషారుగా కన్పించలేదు. సహజంగా కన్పించాడంతే. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 'బిగ్‌ బాస్‌' సీజన్‌ 1 హోస్ట్‌గా వ్యవహరించిన సంగతి తెల్సిందే. డే వన్‌ నుంచే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, 'బిగ్‌ బాస్‌' రియాల్టీ షోకి ఊపు తీసుకొచ్చేశాడు. తనదైన స్టైలింగ్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌తో 'బిగ్‌ బాస్‌' రియాల్టీ షోని పరుగులు పెట్టించాడు. హోస్ట్‌ ఎంత యాక్టివ్‌గా వున్నా, పార్టిసిపెంట్లదే సింహభాగం. వారంలో చివరి రెండ్రోజులు మాత్రమే హోస్ట్‌ కన్పిస్తాడు. మిగతా రోజులన్నీ పార్టిసిపెంట్లే షోను నడిపించాల్సి వుంటుంది. 

గీతా మాధురి, తనీష్‌, తేజస్వి, బాబు గోగినేని, దీప్తి సునయన, దీప్తి (యాంకర్‌), సామ్రాట్‌.. ఇలా హౌస్‌ మేట్స్‌లో ఎవరూ అంత ఎనర్జిటిక్‌గా కన్పించడంలేదు. రోజంతా హౌస్‌లో సందడి చేయాల్సి వుండగా, పార్టిసిపెంట్స్‌లో ఒకరిద్దరు మినహా, సందడి చేసేవాళ్ళెవరూ లేరన్న అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. 

ఇప్పుడే కదా షో మొదలయ్యింది.. అప్పుడే, పూర్తి అంచనాకి వచ్చేయలేం. కొన్ని రోజులు ఆగితే, నాని 'బిగ్‌ బాస్‌' ఎలా వుంటుందో ఓ స్పష్టత వస్తుంది. అప్పటిదాకా జస్ట్‌ వెయిట్‌ అండ్‌ వాచ్‌ అంతే.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS