సూపర్ స్టార్ ని ఒక్క ఛాన్స్ అడిగిన హరీష్

మరిన్ని వార్తలు

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రచయితగా మొదలై దర్శకుడిగా మారిన వారిలో హరీష్ శంకర్ ఒకరు. అయన సినిమాలే కాదు స్వతాహాగా కూడా ఆయన మంచి ఎనర్జీతో ఉంటుంటాడు, అదే ఆయన ఎక్కడైనా మాట్లాడే సమయంలో కూడా అక్కడ కనిపిస్తుంది. 

ఈ తరుణంలో హరీష్ శంకర్ నిన్న సమ్మోహనం ఆడియో ఈవెంట్ లో ఆయన సూపర్ స్టార్ మహేష్ ని గురించి మాట్లాడిన తీరు అందరిని ఆకట్టుకుంది. ఆయన ఏమి మాట్లాడారంటే- మహేష్ ఏ దర్శకుడితో నటిస్తే ఆ దర్శకుడి తీరుకి తగ్గట్టుగా నటించే గొప్ప నటుడు అని దానికి పలు ఉదాహరణలే- పోకిరి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, శ్రీమంతుడు అని చెప్పుకొచ్చాడు. 

అయితే మహేష్ గారితో పనిచేసే అవకాశం దక్కలేదు అనే పై సినిమాల గురించి చెప్పాను, త్వరలోనే తనకి కూడా ఒక అవకాశం వస్తుంది అని రావాలి అని కూడా కోరుకుంటున్నాను అని తనదైన శైలిలో చెప్పడంతో అందరూ నవ్వులు ఆపుకోలేకపోయారు. 

మరి మహేష్-హరీష్ కలయిక త్వరలో ఉంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి.

 


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS