'మహానటి'తో ముద్దుగుమ్మ కీర్తిసురేష్ పేరు మార్మోగిపోతోందిప్పుడు. టాలీవుడ్, కోలీవుడ్‌తో పాటు రాజకీయా చర్చల్లోనూ 'మహానటి' టాపిక్ వస్తోందంటే, ఎంతగా ఈ సినిమా ఇంపాక్ట్ చూపించిందో ప్రత్యేకంగా చెప్పవలిసిన పని లేదు. ఓ సినిమా హిట్ అయ్యిందంటే ఆ సినిమాలో నటించిన నటీనటులకు చెప్పలేనంత క్రేజ్ రావడం, స్టార్స్ పక్కన ఆఫర్స్ వస్తున్నాయంటూ గాసిప్స్ చక్కర్లు కొట్టడం షరా మామూలే. అదే ఇప్పుడు కీర్తిసురేష్ విషయంలో జరుగుతోంది.
సావిత్రి పాత్ర పోషించిన కీర్తి సురేష్‌కి ఈ సినిమా, ఈ పాత్ర రెండూ కెరీర్ బెస్ట్ అనే చెప్పాలి. కొత్త నటి అయినప్పటికీ, ఆ మహానటిని మరిపించేలా తన టాలెంట్ చూపించింది. అందుకే ఆమెని అంతా సావిత్రి మళ్లీ పుట్టింది. రెండో సావిత్రి కీర్తిసురేష్ అంటూ ప్రశంసలతో కీర్తించారు. ఇకపోతే, ఈ సినిమా సక్సెస్‌తో కీర్తిసురేష్‌కి హాటెస్ట్ ఆఫర్స్ క్యూ కడుతున్నాయనే ప్రచారం కూడా మొదలైపోయింది. అందులో భాగంగానే రాజమౌళి తన మల్టీ స్టారర్ కోసం కీర్తిని ఎంపిక చేశాడనే ప్రచారం జోరుగా సాగుతోంది.
ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, కీర్తి ఆన్ స్క్రీన్‌పై ఎవరితో రొమాన్స్ చేయనుంది? ఈ సినిమాలో ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్, ఎన్టీఆర్. వీరిద్దరిలో కీర్తి జోడీ కట్టేదెవరితో? ఇలాంటి ప్రశ్నలు అభిమానుల్లో ఆశక్తి రేపుతున్నాయి. 'మహానటి' విషయంలో రాజమౌళి ప్రత్యేకంగా కీర్తి సురేష్‌ని ప్రశంసించిన సంగతి తెలిసిందే.
అంత మాత్రాన తన సినిమాలో ఛాన్స్ ఇవ్వాలని రూలేమీ లేదు. అలా అని ఇవ్వకూడదనీ లేదు. అయితే అందుకు స్టోరీ డిమాండ్ చేయాలి. పాత్ర డిమాండ్ చేయాలి. ఇవన్నీ కలిసొస్తే, ఏమో కీర్తికి ఈ బంపర్ ఆఫర్ వచ్చినా రావచ్చు.