బిచ్చగాడు చిత్రంతో తెలుగు నాట తనకంటూ ఒక ప్రత్యేక మార్కెట్ సంపాదించుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఇక ఆ చిత్రం ఇక్కడ సాధించిన విజయంతో తను తమిళంలో చేసిన ప్రతి చిత్రాన్ని తమిళంలో విడుదల చేసేందుకు ఉత్సాహం చూపుతూనే ఉన్నాడు.
ఆ కోవలోకే చెందుతుంది ఆయన తాజా చిత్రం కాశి. స్వతాహాగా నటుడు-నిర్మాత-దర్శకుడైన విజయ్, తన చిత్రాలని ఎలా ప్రమోట్ చేసుకోవాలి అన్న అంశంలో ఆయనకి బాగా పట్టు ఉంది. అందుకోసమే ఆయన చిత్రాన్ని వైవిధ్యంగా ప్రమోట్ చేస్తున్నాడు.
అది ఎలాగంటే- ఈరోజు తన సినిమాకి సంబందించిన మొదటి 7 నిమిషాలని సోషల్ మీడియా ద్వారా విడుదల చేయనున్నాడు. దీనితో సినిమా పైన ఆసక్తి పెంచడమే కాకుండా ఎక్కువమంది ప్రేక్షకుల దృష్టిలో పడేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది అని అర్ధమవుతుంది.
మొత్తానికి విజయ్ ఆంటోనీ ఏమి చేసినా వైవిధ్యమే అని చెప్పొచ్చు...