శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సినీ క్రిటిక్ కత్తి మహేష్‌పై కేసులు నమోదయ్యాయి. పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో అంతవరకూ ఎవరికీ తెలియని కత్తి మహేష్ ఇప్పుడు ఎంతగా పాపులర్ అయ్యాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అయితే వివాదాస్పద వ్యాఖ్యలు అన్నిసార్లూ పబ్లిసిటీకి వర్కవుట్ అవ్వవు. పవన్ కళ్యాణ్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు టైం కలిసొచ్చేసింది. పాపులర్ అయిపోయాడు. కానీ ఈ సారి మాత్రం బెడిసికొట్టేసింది. హిందువుల పవిత్ర దైవం శ్రీరామునిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆయనపై కేసులు నమోదు చేశారు.
ఇంతవరకూ సినిమా క్రిటిక్‌గా ఉన్న కత్తి మహేష్ ఇప్పుడు రాజకీయాల్లోకి వస్తానంటున్నాడు. ఎంపీగా పోటీ చేస్తానంటున్నాడు. రాజకీయాల్లోకి వచ్చే వ్యక్తి నోటిని ఎంత ఆదుపులో ఉంచుకోవాలో కత్తి మహేష్ గ్రహించాలి. క్రిటిక్‌గా తన నోటికి వచ్చినట్లు మాట్లాడారు. చెల్లిపోయింది. కానీ రాజకీయాల్లో అలా కుదరదు. ఎవరి మనోభావాలు దెబ్బ తీసేలా మాట్లాడకూడదు. అలాంటిది శ్రీరామునిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్.
దాంతో పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి, ఒకసారి విచారణ జరిపారు. మరోసారి విచారణకు హాజరు కావాలని పోలీసులు కత్తి మహేష్‌కు సూచించారు. మరి ఇప్పటికైనా తన వ్యాఖ్యలను కత్తి మహేష్ వెనక్కి తీసుకుంటారో లేదో చూడాలి మరి.