రవిబాబు స్పెషల్‌ ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌.!

మరిన్ని వార్తలు

'హమ్‌ ఫిట్‌ తో ఇండియా ఫిట్‌ హై' ప్రచారంలో భాగంగా డైరెక్టర్‌ కమ్‌ నటుడు రవిబాబు కాస్త విభిన్నంగా ఆలోచించాడు. ఆ మాటకొస్తే, రవిబాబు ఏం చేసినా విభ్నింగానే ఉంటుంది. అందుకే ఈ సరికొత్త ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌ అన్న మాట. ఆగండాగండి ఇందులో రవిబాబు స్వార్ధం కూడా ఉందండోయ్‌. 

ఓ పక్క ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌, మరో పక్క తన సినిమా ప్రమోషన్‌.. ఒక్క దెబ్బకే రెండు పిట్టలన్న మాట. పంది పిల్లను వీపుపై ఎక్కించుకుని పుష్‌ అప్స్‌ చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఇప్పుడీ వీడియో వైరల్‌ అయ్యింది. మా బంటి ఇప్పుడు ఫిట్‌నెస్‌ కోసం చక్కగా వ్యాయాయం చేయగలుగుతోందంటూ పేర్కొన్నాడు.

రవిబాబు దర్శకత్వంలో 'అదుగో' అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. పందిపిల్ల ఈ చిత్రంలో ప్రధాన తారాగణంగా నటిస్తోన్న సంగతి కూడా తెలిసిందే. సినిమాలో దీని పేరు బంటి. మొన్నామధ్య మా బంటి చక్కగా పళ్లు తోముకుంటోందంటూ ఓ వీడియో పోస్ట్‌ చేశాడు. ఇప్పటికే చాలా రకాలుగా ఈ సినిమాకి ప్రమోషన్స్‌ నిర్వహించాడు రవిబాబు. అయితే సినిమా విడుదల తేదీ మాత్రం ఇంకా తెలిసి రావడం లేదు. 

సమ్మర్‌లో వస్తుందనుకున్న ఈ సినిమా కాస్త ఆలస్యమైంది. ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందో ఇంకా క్లారిటీ లేదు. సురేష్‌ బాబు సమర్పణలో ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌లో రూపొందుతోందీ చిత్రం.


JOIN THE iqlik movies CONVERSATION

To fine out more about Facebook commenting please read the Conversation Guidelines and FAQS