బుల్లితెరపై ప్రసారమవుతున్న 'బిగ్‌బాస్' సెకండ్ సీజన్ తొలి నుండీ వివాదాలకు కేంద్రబిందువవుతోంది. తొలి ఎలిమినేషన్ అయిన కంటెస్టెంట్ సంజన హౌస్ నుండి బయటికి వచ్చి, బిగ్‌బాస్ టీమ్‌పై ఎలాంటి కామెంట్స్ చేసిందో తెలిసిన సంగతే.
ఇకపోతే సెకండ్ ఎలిమినేష్ నూతన్ నాయుడు కామ్‌గానే వచ్చేశాడు. నూతన్ నాయుడు హౌస్ నుండి బయటికి రావడం చాలా మంది ఆడియన్స్‌కి నచ్చని విషయమే. కానీ ఓటింగ్ ప్రకారం మరికొంతమంది ఆడియన్స్ ఆయన బయటికి రావాలని కోరుకున్నారన్నది బిగ్‌బాస్ టీమ్ రూల్ ప్రకారం జరిగిన ఎలిమినేషన్‌లో భాగం.
ఇకపోతే మూడోసారి ఎలిమినేషన్ కోసం నామినేట్ అయిన వారిలో సామాన్యుడు గణేష్ ఉండడం ఒకింత అనుమానానికి గురి చేస్తోంది. ఈ సారి సామాన్యులకు కూడా అనే ట్యాగ్ లైన్‌తో స్టార్ట్ అయ్యి, కొన్ని లక్షల మందిని ఆడిషన్‌కి పిలిచి, వారిలో నుండి ముగ్గుర్ని బిగ్‌బాస్ కంటెస్టెంట్స్‌గా ఎంచుకున్న బిగ్‌బాస్ టీమ్ కనీసం కొన్ని వారాలైనా హౌస్‌లో ఉండనీయకుండా, ఒక్కొక్కరిగా వారిని బయటికి పంపడంలో అర్ధమేంటి? అనేది సామాన్యుల ప్రశ్న.
అంటే బిగ్‌బాస్ సామాన్యుల విషయంలో సీత కన్నేశాడా? సామాన్యులకు డబ్బులివ్వడం బిగ్‌బాస్‌కి నచ్చడం లేదా? ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బిగ్‌బాస్‌పై వచ్చిన ఈ మచ్చ చెరిగిపోవాలంటే ఈ సారి ఖచ్చితంగా గణేష్ ఎలిమినేషన్ జరగకూడదు. అయితే ఇది సాధ్యమేనా? ఏం జరుగుతుందో తెలియాలంటే, వచ్చే వారం దాకా వేచి చూడాల్సిందే.