బిగ్ బాస్ తెలుగు ఎపిసోడ్స్ రోజుకొక మలుపుతో ఒక కమర్షియల్ చిత్రానికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటున్నది.
అయితే ఈ రోజు ప్రసారమయ్యే ఎపిసోడ్ లో దొంగలు పడి హౌస్ మేట్స్ వస్తువులు ఎత్తుకెళ్ళడం హైలైట్ కానుంది. దీనికి సంబందించిన వీడియో బైట్స్ కూడా స్టార్ మా ప్రసారం చేసింది.
ఇలా దొంగిలించడం కూడా టాస్క్ లో భాగమే అని ఇప్పుడు ఆ దొంగిలించిన వస్తువులు కాపాడుకోవడానికి హౌస్ మేట్స్ ఏం చేయాలి అన్నదే రాబోయే ఎపిసోడ్స్ లో జరగబోతుంది అనేది బిగ్ బాస్ హిందీ వెర్షన్ ఫాలో అయిన వారు చెబుతున్న మాట.
ఏదేమైనప్పటికీ, ముమైత్ ఖాన్ ని ఎలిమినేట్ చేసినట్టు చేసి హౌస్ మేట్స్ కి తెలియకుండా అక్కడే ఉంచడంతో బిగ్ బాస్ హౌస్ సంచలనాలకి తెరలేపగా ఈరోజు మరొక సంచలనాత్మక ఎపిసోడ్ ప్రసారం కానుంది.