మహేష్-మురుగదాస్ కలయికలో వస్తున్న స్పైడర్ చిత్రం విడుదలకి కారణాలని దర్శకుడు మురుగదాస్ వివరించాడు.
ఆ కారాణాలు ఏంటంటే- స్పైడర్ చిత్రాన్ని పక్కా ద్విబాశా చిత్రంగా రూపొందించారు. ఇందులో భాగంగానే- ప్రతి సన్నివేశాన్ని రెండు సార్లు తీయడం, పైగా కొంతమంది నటులని ఇరు బాషలకి తగట్టుగా మార్చడం కూడా ఆలస్యానికి ముఖ్య కారణం అని చెప్పాడు.
ఇక తనలాగే మహేష్ కూడా పెర్ఫెక్షన్ కోరుకునే వ్యక్తి అని, తాను అనుకున్న విధంగా సన్నివేశం వచ్చే అంతవరకు షూటింగ్ కొనసాగించాము అని తెలిపాడు. కొన్ని సన్నివేశాలని రీ-షూట్ చేసే పరిస్థితి కూడా తలెత్తింది అని చెప్పుకొచ్చాడు.
చివరగా తన కెరీర్ లో ఇప్పటివరకు ద్విబాశా చిత్రం ఎప్పుడు తీయలేదు అని అందువల్లనే తనకి షూటింగ్ సమయం ఎక్కువగా పట్టింది అని ముక్తాయించాడు.
ఆలస్యానికి కొంత ఇబ్బంది పడిన అభిమానులకి ఈ చిత్రం తప్పక ఆకట్టుకుంటుంది.