రోజు రాత్రి 9గంటలు దాటిందంటే చాలు తెలుగు ప్రేక్షకుల్లో ఎక్కువ భాగం ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోని చూడడానికి రెడీ అయిపోతున్నారు.
ఇక షో విషయానికి వస్తే, హైయెస్ట్ TRP రేటింగ్స్ తో రోజురోజుకి ఈ షో బంపర్ హిట్ గా దూసుకుపోతున్నది. ఇక ఈ మధ్యనే ఈ షోలో గెలిచిన వారికి రూ 50 లక్షలు ఇస్తామంటూ ప్రకటించారు.
దీనిపైన కొంతమంది ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతటి సక్సెస్ అందుకున్న షోలో ప్రైజ్ మనీ ఇంత తక్కువనా అనే మాట అందరి నోట వినిపిస్తున్నది.
బిగ్ బాస్ షో ఇప్పుడు ఒక Successful రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న తరుణంలో ప్రైజ్ మనీ విషయంలో ఇంకొంత ఎక్కువ ప్రకటించాల్సింది అనే ప్రజాభిప్రాయంగా ఉంది.