రామ్ చరణ్ కథానాయకుడిగా శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా మొదలైంది. బుధవారమే ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. అన్నపూర్ణ స్డూడియోలో ఈ సినిమా ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా సాగింది. అయితే క్లాప్ కొట్టడానికే దాదాపు కోటి రూపాయల వరకూ ఖర్చు పెట్టాడని టాక్. ఈ సినిమా ఓపెనింగ్ అంటూ... ఓ పోస్టర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఆ పోస్టర్ కోసం దాదాపుగా 70 లక్షలు ఖర్చయ్యిందట.
రామ్ చరణ్, అద్వాణీ, శంకర్,దిల్ రాజుతో పాటు.. చిత్రబృందం అంతా.. సూటూ, బూటూ వేసుకుని కనిపించారు. ఈ కాస్ట్యూమ్స్ ఖర్చు 70 లక్షల పైమాటే అని టాక్. చిత్రబృందం కోసం హైదరాబాద్ లో తీసిన హోటెల్ గదులు, వాళ్ల ఖర్చులు అన్నీ కలుపుకుని కోటిరూపాయలు అయ్యిందట. దిల్ రాజు బ్యానర్లో నిర్మిస్తున్న 50వ సినిమా ఇది. అందుకే ఇంత లావిష్ గా మొదలుపెట్టారు. శంకర్ సినిమాలన్నీ అంతే. ప్రతీ విషయంలోనూ భారీదనం చూపిస్తుంటారు. కాకపోతే... క్లాప్ కొట్టడానికే కోటి అయ్యిందంటే, సినిమా అయ్యేలోగా ఎంత అవుతుందో అని డ్రేడ్ వర్గాలు లెక్కలేస్తున్నాయి.