'బలుపు', 'డాన్ శీను' సినిమాలతో మాస్ హిట్స్ అందుకున్న రవితేజ - గోపీచంద్ మలినేని కాంబో ముచ్చటగా మూడోసారి జత కట్టబోతున్నారు. ఈ కాంబోలో త్వరలోనే ఓ సినిమా రానుందట. ఆల్రెడీ స్క్రిప్టు పనులు స్టార్ట్ అయ్యాయనీ సమాచారం. ఇటీవల ఈ కాంబోపై పలు గాసిప్స్ వచ్చాయి. అయితే, తాజాగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ట్విట్టర్ వేదికగా ఆ గాసిప్స్‌కి చెక్ పెట్టేశారు. త్వరలోనే రవితేజతో సినిమా ఉండబోతోందని కన్‌ఫామ్ చేశారు. సో రవితేజ నుండి ఓ మాస్ మసాలా ఎంటర్‌టైనర్‌కి గోపీచంద్ రంగం సిద్ధం చేస్తున్నాడని క్లారిటీ వచ్చేయడంతో ఫ్యాన్స్ ఫిక్సయిపోయారు.
ప్రస్తుతం 'డిస్కోరాజా' సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఈ సినిమాని క్రిస్‌మస్ కానుకగా డిశంబర్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్ ఈ సినిమాలో రవితేజతో జోడీ కడుతున్నారు. వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమాకి సంబంధించి రవితేజ లుక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. కాలాన్ని వెనక్కి పంపడం అనే ఓ విభిన్న కథనంతో ఈ సినిమా తెరకెక్కుతోందట. ఈ సినిమా పూర్తి కాగానే, గోపీచంద్ మలినేని సినిమాని పట్టాలెక్కించేయనున్నాడట మాస్ రాజా రవితేజ. ఈ కాంబినేషన్‌లో రాబోయే సినిమా మాత్రం రవితేజ మార్క్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కానుందని విశ్వసనీయ వర్గాల సమాచారమ్.