అంగరంగ వైభవంగా జరిగిన ఈ సంవత్సరపు ఆస్కార్ అవార్డ్స్ ప్రధానోత్సవంలో ఒక పెద్ద పొరపాటు జరిగంది.
వివరాల్లోకి వెళితే, బెస్ట్ ఫిలిం అవార్డు ప్రకటించే సందర్భంలో మూన్ లైట్ కి ఇవ్వాల్సిన అవార్డు పొరపాటున లా లా ల్యాండ్ కి ప్రకటించేశారు. ఈ విషయం లా లా ల్యాండ్ మూవీ యూనిట్ తమ ఆనందాన్ని స్టేజి పై వ్యక్తం చేస్తున్న సమయంలో బయటపడింది. దీనితో స్వయంగా లా లా ల్యాండ్ ప్రొడ్యూసర్ వెంటనే మూన్ లైట్ బెస్ట్ ఫిలిం అవార్డు గెలించిందని ప్రకటించాడు.
ఒక్కసారిగా ఏం జరుగుతుందో ఎవరికి అర్ధం కాలేదు. ఆ తరువాత అందరు తేరుకొని, లా లా ల్యాండ్ టీం తము తీసుకున్న అవార్డ్స్ ని మూన్ లైట్ టీం కి ఇవ్వడంతో కధ సుకాంతమయింది.
అయితే ఈ పోరాపటుకి కారణం, అనౌన్స్మెంట్ కార్డ్స్ తారుమారు అవ్వడం అని చెబుతున్నారు. ఏదైతేనేమి ఈ యేడు ఆస్కార్స్ లో జరిగిన ఈ సంఘటన ఒక బ్లాక్ స్పాట్ లా మిగిలిపోనుంది.