బుల్లితెర రియాల్టీ షో బిగ్‌బాస్‌లో వాతావరణం హీటెక్కింది. 'డీజె' టాస్క్‌లో భాగంగా బిగ్‌బాస్ ప్లే చేసిన సాంగ్స్‌కి ఇంటి సభ్యులు జోష్‌ఫుల్‌గా స్టెప్పులేశారు. రెయిన్ డాన్సులతో తడిసి ముద్దైపోయారు. తనీష్, రోల్ రైడా డాన్సులతో పాటు, పర్‌ఫామెన్స్‌తోనూ కెవ్వుకేక పుట్టించేశారు. దీప్తి స్లీవ్‌లెస్ నేవీ బ్లూ కలర్ ఫ్రాక్‌లో హాట్ హాట్ స్టెప్పులు ఇరగదీసేసింది. ఇంతకు ముందెన్నడూ లేనంత జోష్‌తో దీప్తి డాన్సులేసింది. మరో కంటెస్టెంట్ నందిని కూడా హాట్ కాస్ట్యూమ్‌తో కిర్రాకు పుట్టించేసింది.
ఇకపోతే అందరినీ మించి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చిన డే 1 నుండీ ఒకే తరహా కాస్ట్యూమ్స్‌తో కిర్రాకు పుట్టిస్తోంది పూజా రామచంద్రన్. మోకాళ్లు దాటని డ్రస్సులతో హాట్ హాట్ థైస్‌ని ఎక్స్‌పోజ్ చేస్తూ ఒకే రకమైన గ్లామర్‌ని మెయింటైన్ చేస్తోంది. ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ డే నుండే హౌస్‌లో స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా పూజా బ్రాండ్ వేయించుకుంది. అంతేకాదు, ఈ వారం కెప్టెన్సీ బాధ్యతలు కూడా అందిపుచ్చుకుంది. సీనియర్ అయిన దీప్తి ఇంకా కెప్టెన్సీ అందుకోలేకపోయింది.
అన్నింటికీ మించి ఎక్స్ హౌస్ మేట్స్ శ్యామల, నూతన్ నాయుడు రీ ఎంట్రీ జరిగిపోయింది. వీరిద్దరి ఎంట్రీతో హౌస్‌కి కొత్త హుందాతనం వచ్చింది. గతంలో నూతన్ నాయుడు పంచిన ఎంటర్‌టైన్‌మెంట్‌ని మించిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ రీ ఎంట్రీ ద్వారా పంచుతానని మాటిచ్చి హౌస్‌లోకి వెళ్లాడు. శ్యామల ఎప్పటిలాగే తనదైన శైలిలో పిన్నిగారి హోదాని పంచుకుంటుందో లేక ఆమె శైలిలో కూడా ఇంకేమైనా కొత్త మార్పులు చూడబోతున్నామో ముందు ముందు తెలుస్తుంది.