హౌస్‌లో సామ్రాట్ బాడీ లాంగ్వేజ్ ఒక్కటే కూల్‌గా కనిపిస్తోంది. గెలుపు ఖాయమే అన్న ధీమాలో ఉన్నాడు. తన గేమ్ పక్కన పెట్టి ఇతరులకు హెల్ప్ చేసే ఆటిట్యూడ్‌తో కనిపిస్తున్నాడు. సో బిగ్‌బాస్ విన్నర్ సామ్రాటే అని సంకేతాలు అందుతున్నాయి. తనీష్ విషయానికి వస్తే, బిగ్‌బాస్ విన్నింగ్‌పై తనీష్‌కి పెద్దగా ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించడం లేదు. కేవలం కౌషల్‌పై రివేంజ్ తప్ప.
కౌషల్‌ని ఎలాగైనా హౌస్ నుండి బయటికి పంపించాలి. బిగ్‌బాస్ విజేతగా కౌషల్‌కి పట్టం కట్టకూడదన్న కసితోనే కనిపిస్తున్నాడు. రోల్ విషయానికి వస్తే, ఇంచుమించు రోల్ పరిస్థితి కూడా ఇంతే. కానీ ఏదో మూల బిగ్‌బాస్ విన్నర్ తానే కావాలన్న సెల్ఫిష్‌తో ఉన్నాడు. ఇక గీత, దీప్తి సంగతి చెప్పనే అక్కర్లేదు. దీప్తి ఇంతవరకూ హౌస్‌లో కొనసాగుతుందని ఊహించలేదు.
ఈ లెవల్ వరకూ వచ్చాక, తనకీ బిగ్‌బాస్ విన్నర్ కావాలనే కోరిక ఉండడంలో అతిశయోక్తి కాదు. గీత కూడా తనీష్ మాదిరిగానే తనకి దక్కకపోయినా ఫర్వాలేదు. కానీ కౌషల్ మాత్రం బిగ్‌బాస్ విజేత కాకూడదనే యోచనలో ఉంది. ఇకపోతే 100 రోజుల ఒంటరి పోరాటంలో కౌషల్ తీవ్ర అసహనానికి గురవుతున్నాడు. మాటల యుద్ధం కాస్తా, ఫిజికల్ ఎటాక్స్ వరకూ వచ్చింది.
దాంతో ఇక గెలుపు దిశగా కాకుండా, సెల్ప్ ఎలిమినేషన్ దిశగా కౌషల్ ఆలోచనలున్నాయేమో అనిపిస్తోంది. సోషల్ మీడియా కూడా కౌషల్ సెల్ఫ్ ఎలిమినేషన్‌కే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే బిగ్‌బాస్ చరిత్రలో ఇదో నూతన ఆధ్యాయం అవుతుందనాలి.