'ఆర్ఎక్స్ 100' సినిమాతో పిచ్చ క్రేజ్ సంపాదించేసిన ముద్దుగుమ్మ పాయల్ రాజ్‌పుత్. రష్మికా మండన్నా తర్వాత ఈ స్థాయిలో క్రేజ్ అందుకున్న డెబ్యూ బ్యూటీ పాయల్ రాజ్‌పుత్. ఇందుకు ఆమె హాట్ ఫిగర్ ముఖ్య కారణం అని చెప్పక తప్పదు. తొలి సినిమా అయినా ఏమాత్రం మొహమాటపడకుండా బోల్డ్ సీన్స్‌లో నటించేసింది. ఆ సినిమా ఆ స్థాయి విజయం సాధించడానికి కారణం ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ సొగసులే.
ఇకపోతే ఈ బ్యూటీ 'ఆర్ఎక్స్ 100' తర్వాత మరో రెండు క్రేజీ ప్రాజెక్టులు సైన్ చేసిందనీ విశ్వసనీయ వర్గాల సమాచారమ్. అయితే ఆ సమాచారమ్లో పక్కా క్లారిటీ లేదు కానీ తాజాగా ఈ ముద్దుగుమ్మ విషయమై మరో టాక్ ప్రచారంలో ఉంది. తనకున్న క్రేజ్‌ని క్యాష్ చేసుకోవడానికి అమ్మడు స్పెషల్ సాంగ్స్‌కి సై అంటోందట. అందులోనూ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సినిమాలో.
మనోడి సినిమాలో స్పెషల్ సాంగ్స్ అంటే రెమ్యునరేషన్ ఏ రేంజ్లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన గత చిత్రాల్లో మిల్కీ బ్యూటీ తమన్నా, కేథరీన్, ప్రగ్యా జైశ్వాల్ తదితరులు స్పెషల్ సాంగ్స్ కోసం పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందుకున్న వాళ్లే. అలాగే ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ కూడా ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ అందుకోబోతోందనీ ప్రచారం జరుగుతోంది.
బెల్లంకొండ - తేజ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రం ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. చూడాలిక ఆర్ఎక్స్ బ్యూటీ హాట్ హాట్ ఐటెం సాంగ్ ఎలా ఉండబోతోందో.