తెలుగు బిగ్‌బాస్ సీజన్ 3 హీట్ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ ప్రొగ్రాంపై ఇంట్రెస్టింగ్ కథనాలు వెల్లడి అవుతున్నాయి. బిగ్‌బాస్ సీజన్ ఉందనీ, లేదనీ, ఇప్పట్లో కాదనీ.. ఇలా ఇంతవరకూ గాసిప్స్‌కే పరిమితమైన బిగ్‌బాస్ సీజన్ 3పై మా టీవీ నిర్వాహకుల నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. త్వరలో ఈ షో ప్రారంభం కానుందని బిగ్‌బాస్ టీమ్ ప్రకటించి దాంతో బిగ్‌బాస్ టీమ్ ప్రకటించింది. అయితే, ఈ సీజన్‌కి హోస్ట్‌గా ఎవరు వ్యవహరించబోతున్నారనే అంశంపై అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు. నాగార్జున దాదాపు ఓకే అయ్యారని మాత్రమే తెలుస్తోంది. ఇదిలా ఉంటే, అల్రెడీ నాగార్జున బిగ్‌బాస్ ప్రోమో షూటింగ్స్‌లో పాల్గొంటున్నాడనీ తాజాగా అందుతోన్న సమాచారమ్. కంటెస్టెంట్స్ వేట ఇంకా కొనసాగుతూనే ఉందట.
కొందరి పేర్లు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి కానీ, వారిలో ఎంతమంది ఫైనల్‌గా హౌస్‌లోకి అడుగుపెడతారనేది ఓపెనింగ్ డే వరకూ కన్ఫామ్ కాదు. ఈ సీజన్‌ని మొదటి రెండు సీజన్స్‌తో పోలిస్తే, మరింత ఎనర్జిటిక్‌గా, వినూత్నంగా ప్లాన్ చేస్తున్నారట. నాగార్జున హోస్ట్‌తో బిగ్‌బాస్‌కి స్టార్డమ్ యాడ్ అయ్యిందనే చెప్పాలి. తొలి సీజన్‌కి ఎన్టీఆర్ హోస్టింగ్ ప్రధాన ఆకర్షణ కాగా, రెండో సీజన్‌కి నాని హోస్టింగ్‌తో స్టార్డమ్ సమస్య ఎదురైంది. కానీ, మూడో సీజన్ మళ్లీ ఎన్టీఆర్ స్టార్ డమ్‌ని మ్యాచ్ చేయడంలో సక్సెస్ అవుతుందని అభిమానులు భావిస్తున్నారు. ఏది ఏమైతేనేం, మొత్తానికి బుల్లితెర ప్రేక్షకులకు బిగ్‌బాస్ సీజన్ 3 మరోసారి డిఫరెంట్ కిక్ ఇచ్చేందుకు సరికొత్తగా ముస్తాబైపోతోందన్న మాట.